Padishala Raghu: ప్రజా దీవెన,కోదాడ: ఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ కుటుంబానికి అన్నివేళలా అండదండలుగా ఉంటామని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు. ఇటీవల గాంధీ తండ్రి పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో నిర్వహించిన దశదినకర్మలో పాల్గొని పుల్లయ్య చిత్రపటానికి రఘు పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం గాంధీని పరామర్శించి అధైర్యపరవద్దని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బంక వెంకటరత్నం, పూర్ణచంద్రరావు, నాయిని మల్లయ్య, రాయలవెంకన్న, షేక్ సుభాని, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు