*ముగ్గురు జర్నలిస్టులకు 11వేల రూపాయల చెక్కులు అందజేత.
Padishala Raghu: ప్రజా దీవెన, కోదాడ: ఇటీవల కురిసిన వర్షాలలో నష్టపోయిన జర్నలిస్టులకు అండగా ఉంటామని ఎలక్ట్రాన్ మీడియా కోదాడ అధ్యక్షులు పరిశాల రఘు (Padishala Raghu) అన్నార నియోజకవర్గ వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి కోదాడ అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో కోదాడ పట్టణంతోపాటు వివిధ మండలాలలో వరద తీవ్రతకు అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో నిత్యం వృత్తిలో కొనసాగుతున్న , జర్నలిస్టుల ఇళ్లలోకి నీరు చేరి, ఆర్థికంగా నష్టపోయారు. ఈ క్రమంలో టి యు డబ్ల్యూ జే హెచ్ వన్ ఫోర్ త్రీ సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ (Press Club) అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ ఆదేశాల మేరకు, కోదాడ పట్టణానికి చెందిన ఇద్దరు జర్నలిస్టులు, అనంతగిరి మండలం గొండ్రియల గ్రామానికి చెందిన, జర్నలిస్టులు ముగ్గురికి 11 వేల రూపాయల చొప్పున చెక్కులను శుక్రవారం కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు (Padishala Raghu) చేతుల మీదగా అందిజేశారు.
రఘు (Padishala Raghu) మాట్లాడుతూ… పేదరికం అనుభవిస్తూ నిత్యం వార్తల సేకరణ చేసే, జర్నలిస్టులకు అనుకోకుండా వచ్చిన విపత్తులో ఆర్థికంగా నష్టపోవడంతో వారి కుటుంబం ప్రస్తుతం ఆర్థికంగా (Financially) ఇబ్బంది కర పరిస్థితిలలో ఉన్నారని అందుకే ఆర్థిక సహాయం అందించినట్లుగా తెలిపారు. జర్నలిస్టులకి ఎవరికి ఆపద వచ్చిన జర్నలిస్టుల అసోసియేషన్ ముందు ఉంటుందని తెలిపారు. గతంలో కూడా అనారోగ్యా రీత్యా ఇబ్బందులు పడ్డ అనేకమంది జర్నలిస్టులకు, వైద్య ఖర్చులకు డబ్బులు అందించినట్లుగా తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో, వెన్నెబోయిన పూర్ణచంద్రరావు, మరికంటి లక్ష్మణ్, తోటపల్లి నాగరాజు, నూకపంగు గోపాల్, బుచ్చి రాములు, షేక్ నజీర్, చీమ శేఖర్, శ్రీకాంత్ ,కాసర్ల సత్యరాజు, మహమూద్, అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు