Padmarao Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: సికిం ద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు స్వల్ప గుండెపోటు వచ్చింది. గుండెపోటు రావడంతో డెహ్రాడూ న్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అయితే డెహ్రా డూన్ పర్యటనలో పద్మారావు గౌడ్ ఉన్నారు. మంగళవారం రాత్రి హైద రాబాద్‌కు పద్మారావు రానున్నారు. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు పద్మారావు గౌడ్ వెళ్లారు. పద్మారావు గౌడ్‌కు గుండెపోటు వచ్చిందని తెలియడంతో బీఆర్ఎ స్ నేతలు ఆందోళన చెందారు.
పద్మారావు గౌడ్ ఆరోగ్యం నికల డగా ఉందని, పూర్తిగా కోలుకు న్నారని వైద్యులు తెలియజే యడంతో వారంతా ఊపిరిపీల్చు కున్నారు. మరోవైపు, పద్మారావు గౌడ్ ఇవాళ రాత్రికి సికింద్రాబాద్‌కు తిరిగి వస్తారని తెలియడంతో ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు పద్మారావు ఇంటికి చేరు కుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా పద్మారావు గౌడ్ ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలి సింది.