ఆరు కోట్ల నిధులతో నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన. పద్మావతి రెడ్డి
Padmavathi Reddy : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతానని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ మున్సిపల్ కార్యాలయంలో టి యు ఎఫ్ ఐ డి సి నిధులు ఆరు కోట్ల రూపాయలతో నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి తన శక్తి వంచనా లేకుండా కృషి చేస్తానని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం తో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసి రాష్ట్రంలోనే ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుపుతానన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి. చందర్ రావు, మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల. కోటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, కమిషనర్. రమాదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.