*రైతుల సమక్షమమే ప్రభుత్వ లక్ష్యం
*దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
Padmavathi Reddy: ప్రజా దీవెన ,కోదాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని దాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి (Padmavathi Reddy) అన్నారు ఆదివారం పిఎసిఎస్ (PACS) ఆధ్వర్యంలో కోదాడ (Kodhad) మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు కోదాడ (Venepalli Chandra Rao Kodada) తాసిల్దార్ వహీద్ అలీ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్ తో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు (Farmers) దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు నాణ్యత, ప్రమాణాలు పాటించి ధాన్యం తీసుకొని వచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని తెలిపారు. మద్దతు ధరతో పాటు సన్నపు ధాన్యాలకు 500 రూపాయలు బోనస్ పొందవచ్చు అని తెలిపారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నరేష్, ముత్తరపు పాండురంగారావు డైరెక్టర్ కమతం వెంకటయ్య, నాయకులు బొల్ల ప్రసాద్, కమతం శ్రీనివాసరావు, కనగాల నారాయణ, తోట శ్రీనివాసరావు, నిడిగొండ కనకయ్య, మాతంగి ప్రసాద్, బత్తినేని శ్రీనివాసరావు, పిఎసిఎస్ సీఈవో మంద వెంకటేశ్వర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.