Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Padmavati : కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లకు సన్మానం

*కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వన్నె తేవాలి

*పార్టీలో పని చేసే నాయకులు కార్యకర్తలు అందరిని గుర్తిస్తాం

*మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి ల నాయకత్వంలో కోదాడఅభివృద్ధి

*కోదాడ వ్యవసాయ మార్కెట్ ను అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం.కోదాడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం

Padmavati : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని కోదాడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం అన్నారు. ఆదివారం కోదాడలోని ఎర్నేని బాబు నివాస గృహము లో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా చైర్ పర్సన్ గా ఎన్నికైన ఎపూరి తిరుపతమ్మ సుధీర్, వైస్ చైర్మన్ గా ఎన్నికైన షేక్ బషీర్ లకు ఏర్పాటుచేసిన అభినందన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

 

అందరము కలిసి కోదాడ వ్యవసాయ మార్కెట్ను అభివృద్ధి చేసుకుందామన్నారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి ల ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గం అని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. కోదాడ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న అనుభవంతో నూతన చైర్మన్ వైస్ చైర్మన్ లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు పార్టీలో కష్టపడి పని చేసే కార్యకర్తలకు నాయకులకు తప్పకుండా గుర్తింపు ఇస్తామన్నారు. అనంతరం సన్మాన గ్రహీతలు చైర్ పర్సన్ ఎపూరి తిరుపతమ్మ సుధీర్ వైస్ చైర్మన్ షేక్ బషీర్ లు మాట్లాడుతూ తమకు ఇంత ఘనంగా సన్మానించిన మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు కు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

అందరి సహాయ సహకారాలతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేస్తామన్నారు తమకు పదవి కేటాయించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి, సహకరించిన సీనియర్ నాయకులకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్. కే జబ్బర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు, కాంగ్రెస్ నాయకులు ఒంటి పులి వెంకటేష్, చింతలపాటి శ్రీనివాస్, రావెళ్ళ కృష్ణారావు, నలజాల శ్రీనివాస్, చందు నాగేశ్వరరావు, మందలపు శేషు, నెమ్మాది దేవమణి ప్రకాష్ బాబు, కౌన్సిలర్లు గంధం యాదగిరి, వంటి పులి రమా శ్రీనివాస్, కోళ్ల ప్రసన్న లక్ష్మి కోటిరెడ్డి, పెండెం వెంకటేశ్వర్లు, కర్రీ శివ సుబ్బారావు, ఖదీర్, కాజా, కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, వేమూరి విద్యాసాగర్, యూత్ అధ్యక్షులు పోటు కోటేశ్వరరావు, లైటింగ్ ప్రసాద్, రామినేని శ్రీనివాసరావు చింత బాబు మాదిగ, కాజా గౌడ్, గంధం పాండు, బొలిశెట్టి భాస్కర్ తదితరులు పాల్గొని సన్మానించారు.