Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Paduri Shankar Reddy: శాలిగౌరారం మార్కెట్ ఛైర్మెన్ గా పాదూరి శంకర్ రెడ్డి

ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్గొండ జిల్లా శాలిగౌరారం వ్యవ సాయం మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం సాయం త్రం జీవో 893 ను జారీ చేసింది. శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటిసి పాదూరి శంకర్ రెడ్డి ని మార్కెట్ కమిటీ నూతన ఛైర్మెన్ గా ప్రభుత్వం నియమించింది. మండలం లోని భైరవునిబండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరిగే నర్సింహా ను వైస్ ఛైర్మెన్ గా మరో 16 మందిని డైరెక్టర్లు నియమితులయ్యారు.డైరెక్టర్లు గా గైగుల్ల అవిలయ్య (ఇటుకులపహాడ్),కుతాటి సోమయ్య (శాలిగౌరారం),బండపల్లి అంజమ్మ-కొమరయ్య (తుడిమిడి ),రాజుల శ్రీనివాస్(మాదారం),దేవరకొండ జయరాజు (పెర్క కొండారం ),తుక్కాని లక్ష్మి నర్సింహారెడ్డి (వల్లాల ),షేక్ లతీఫ్ (జాలోనిగూడెం),బోడ దానయ్య (అడ్లూర్),పడాల రమేష్(తిరుమలరాయినిగూడెం), తాందారు సత్తయ్య (శాలిగౌరారం),బెలిదే రమేష్(నకిరేకల్ ),తానం జోజిరెడ్డి(వంగమర్తి ),తాల్లూరి మురళీ సింగల్ విండో ఛైర్మెన్ శాలిగౌరారం,జిల్లా మార్కెటింగ్ అధికారి నల్గొండ,వ్యవసాయం శాఖ ఏడి నకిరేకల్,స్పెషల్ ఆఫీసర్ శాలిగౌరారం గ్రామ పంచాయితీ శాలిగౌరారం డైరెక్టర్లు గా నియమితులయ్యారు.

రెండు సంవత్సరాలు పాలక వర్గం కొనసాగనున్నది. 2019 లో శాలిగౌరారం మార్కె ట్ ఏర్పాటు…నకిరేకల్ వ్యవ సాయం మార్కెట్ పరిధిలో ఉన్న శాలిగౌరారం సబ్ మార్కెట్ ను 2019 సంవత్సరం లో నూతనంగా శాలిగౌరారం వ్యవసాయం మార్కెట్ ను ఏర్పాటు చేశారు.మొదటి సారి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ జనరల్ మహిళ కు రిజర్వు చేయడం తో బిఆర్ఎస్ పార్టీకి చెందిన కట్ట వెంకట రెడ్డి సతీమణి కట్ట లక్ష్మి(అడ్లూర్ )ఛైర్మెన్ అయ్యారు. రెండవ సారి ఛైర్మెన్ పదవి ఎస్సి మహిళకు రిజర్వు చేయడం తో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి సర్వయ్య కుమార్తె తేజస్విని (మాదారం) ఛైర్మెన్ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత మూడవ సారి ఛైర్మెన్ పదవి కె జనరల్ రిజర్వు కావడం తో కోమటిరెడ్డి బ్రదర్స్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ కు అత్యంత దగ్గరగా ఉండే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన చిత్తలూరు గ్రామానికి చెందిన పాదూరి శంకర్ రెడ్డి ఛైర్మెన్ పదవి వరించింది..