Paidimarri Satthibabu: ప్రజా దీవెన, కోదాడ: చాకలి ఐలమ్మ (Ailamma)స్ఫూర్తితో ప్రజలకు 6 గ్యారంటీ ల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాడుదాం అని బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, సీనియర్ నాయకులు పైడిమర్రి సత్తిబాబు లు (Paidimarri Satthibabu) అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ 129 వ జయంతి సందర్భంగా పట్టణంలోని మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న ఆమె విగ్రహానికి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం,భుక్తి కోసం, హక్కుల కోసం(For land, for Bhukti, for rights),వెట్టి చాకిరి విముక్తి కోసం ఉద్యమించిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
ఆమె పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు మోసపూరిత హామీలతో మాయమాటలతో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు బి ఆర్ ఎస్ (brs) నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, సీనియర్ నాయకులు పైడిమర్రి సత్తిబాబు కౌన్సిలర్ మేదర లలిత, పిట్టల భాగ్యమ్మ, ఎం.డి.ఇమ్రాన్ ఖాన్, కర్ల సుందర్ బాబు, సుంకర అభిధర్ నాయుడు, కాసాని మల్లయ్య గౌడ్, చలిగంటి వెంకట్, చీమ శ్రీనివాసరావు, బచ్చలకూరి నాగరాజు, మాదాల ఉపేందర్ యాదవ్, షేక్ అబ్బు, షేక్ ఆరిఫ్, గొర్రె రాజేష్, షేక్ మజాహర్, కొక్కి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.