–తెల్లవారుజామునుంచే గులాబీ లనేతల హౌస్ అరెస్టు
–భారీగా మోహరిoచిన పోలీసులు
Pailla Shekhar Reddy, : ప్రజా దీవెన, యాదాద్రి: యాదాద్రి భువనగిరిలో జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల దాడికి నిరసనగా బీఆ ర్ఎస్ తలపెట్టిన మహా ధర్నాకు పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులను భారీగా మోహరించారు. మరోవైపు ఎక్క డికక్కడ గులాబీ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రె డ్డి, భాస్కరరావు, సీనియర్ నేతలు బూడిద భిక్షమయ్య గౌడ్, క్యామ మల్లేష్, ఆలేరులో మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, యాదగిరిగు ట్టలో ఉమ్మడి నల్గొండ మాజీ డీసీ సీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి ని గృహ నిర్బంధం లో ఉంచారు. పలువురు నాయకులను ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు.
అక్రమ అరెస్టులు అన్యాయం:
ఉమ్మడి నల్గొండ జిల్లా సహా హైద రాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నాయ కులు, కార్యకర్తలను ఎక్క డిక్కడ అరెస్టులు, గృహ నిర్బంధం చేయ డాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ‘యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడులను నిరసిస్తూ చేపట్టిన ధర్నా కార్యక్ర మాన్ని భగ్నం చేసేందుకు పోలీసు లు అక్రమ అరెస్టులకు తెరలేపడం దుర్మా ర్గం. పోలీసు బలం ఉపయో గించి, ప్రతిపక్షాలను అణిచివేయా లని చూడటం అప్రజాస్వామికం. అక్రమ అరెస్టులు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.