–సీఐటీయూ
CITU : ప్రజాదీవెన నల్గొండ : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెయింటింగ్ కార్మికుల కూలి రేట్లు పెంచుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నూతన కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెయింటింగ్ కార్మికులకు ఇస్తున్న రేట్లు పె పెరగాల్సిన అవసరం ఉంది. ఆగస్టు 1నాటికి నూతన రేట్లు నిర్ణయించి అమలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతినెల 1వ తేదీ పని బందు కచ్చితంగా అమలు జరపాలని, కార్మికులంతా పని వేళలు పాటించాలని, సభ్యత్వం కలిగిన పెయింటర్ కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి యూనియన్ నుండి 5వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, పెయింటింగ్ కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచడం కోసం యూనియన్ కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.
యూనియన్ అధ్యక్షులు భీమనపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిఐటియు టౌన్ కన్వీనర్ అవుట రవీందర్, యూనియన్ గౌరవ సలహాదారులు కత్తుల జగన్, కార్యదర్శి దుప్పలపల్లి శంకర్, కోశాధికారి బైరు నరసింహ, ఉపాధ్యక్షులు బుషిపాక యాదగిరి, సహాయ కార్యదర్శి ఎస్కే జానీ, ప్రచార కార్యదర్శి ఆకారం చరణ్ , సభ్యులు కత్తుల వెంకన్న, జంజరాల శేఖర్, జంగాల యాదగిరి, గాదరి నాగరాజు, కాశీమల్ల విజయ్, ఎడ్ల రాములు, జాకటి సతీష్, కత్తుల రాములు, పిట్టల శివ తదితరులు పాల్గొన్నారు.