Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Palvai Venkatesh: పరిశుభ్రత, పౌష్టికాహారం తోనే ఆరోగ్యం

Palvai Venkatesh: ప్రజా దీవెన, శాలిగౌరారం: ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటిస్తూ పౌష్టికాహారం (Nutritious food) తీసుకున్నపుడే ఆరోగ్యంగా ఉంటారని మండల వైద్యాధికారి డాక్టర్ పాల్వాయి వెంకటేష్ (Palvai Venkatesh) అన్నారు.శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 12వ వారం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి గర్భిణీ పుష్టికరమైనతీసుకొని డాక్టర్ల సలహాలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రి (hospital) లోనే ప్రసూతి కావాలన్నారు.

పౌష్టికాహర (Nutritional)దాతలు లయన్స్ క్లబ్ (Lions Club) చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు -నాగమణి దంపతుల కుమారుడు బుడిగె కార్తీక్ జన్మదినం పురస్కరించుకొని గర్భణి మహిళలలకు, ఆరోగ్య కేంద్రం సిబ్బందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం లో పిహెచ్ఎన్ రాములమ్మ,సూపర్ వైజర్లు దయామణి,మరియా,లయన్ క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ, కోశాధికారి వడ్లకొండ బిక్షం,ప్రతినిధులు దునక వెంకన్న,బచ్చు ఆంజనేయులు, చిత్తలూరి శ్రీనివాస్,ఎఎన్ఎం లు, ఆశా వర్కర్లు వివిధ గ్రామాల గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.