–ఓటర్ల తుది జాబితాపై ఎన్నికల క మిషన్ కీలక ఆదేశాలు
–పోలింగ్ కేంద్రాలు, తుదిఓటర్ల జా బితా విడుదలకు నోటిఫికేషన్
–ఈనెల28న గ్రామ పంచాయతీ, మండలపరిషత్ లలో ప్రదర్శన
–29న ఎన్నికల అధికారులు, రాజ కీయ పార్టీలతో సమావేశం
–30న మండల స్థాయిలో ఎంపీడీ వోలు,పార్టీలప్రతినిధులతో మీటింగ్
–ఈ నెల 28 నుంచి 30 వరకు ఓ టర్ల జాబితాపై అభ్యంతరాలు
–సెప్టెంబర్ 2న ఓటర్ల తుదిజాబి తా ప్రకటన
Panchayat Elections : ప్రజాదీవెన, నల్లగొండ: ఓటర్ల తుది జాబితాపై అధికారులకు రాష్ట్ర ఎ న్నికల కమిషన్ కీలక ఆదేశాలు జా రీ చేసింది. రాష్ట్రంలో గ్రామ పంచా యతీ ఎన్నికల నిర్వహణకు ప్రభు త్వంతో పాటు పార్టీలు సన్నద్ధం కా వడంతో తాజాగా రాష్ట్ర ఎన్నికల క మిషన్ ఏర్పాటు ప్రక్రియలో మరిం త వేగం పెంచింది.ఎన్నికల నిర్వహ ణకు ముఖ్యమైన తుది ఓటర్ల జా బితా రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళ వారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు తెలంగాణ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పం చాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 2న ప్రదర్శించాలని అధికారులకు ఆదే శాలు ఇచ్చారు. ఈ నెల 28న గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిష త్ కార్యాలాయాల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 29న జిల్లా ఎన్నికల అధికా రులు రాజకీయ పార్టీల ప్రతినిధు లతో సమావేశం నిర్వహించనున్నా రు. ఈ నెల 30న మండల స్థాయి లో ఎంపీడీవోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పా టు చేయనున్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి పరిష్కరించనున్నారు. వచ్చే నెల 2న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు.