పాండురంగారావు మిత్రమండలి గ్రామ ప్రజలకు చేస్తున్న కృషి అభినందనీయం. చందర్ రావు
Panduranga Rao Mitramandali : ప్రజా దీవెన, కోదాడ: ముత్తవరపు లక్ష్మమ్మ, సుబ్బారావుల జ్ఞాపకార్థం ముత్తవరపు పాండురంగారావు మిత్రమండలి ఆధ్వర్యంలో కాపుగల్లు గ్రామ ప్రజలందరికీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. ఆదివారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో హైదరాబాద్ కు చెందిన శ్యామ్ హాస్పిటల్ వైద్య బృందం, కోదాడ పట్టణ ప్రముఖ వైద్యుల సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అయన ముఖ్య అధిత గా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మిత్రమండలి ఆధ్వర్యంలో పాండురంగారావు రాజకీయాలకు అతీతంగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని రాజకీయాల కంటే తనకు ప్రజాసేవ అంటేనే ఇష్టమని గుర్తు చేశారు. గ్రామీణ పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలందించే లక్ష్యంగా పాండురంగారావు చూపుతున్న ఔదార్యం మరువ లేనిదని అన్నారు. ఈ సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ముత్తవరపు పాండురంగారావు, లక్ష్మీ దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్, గుండె, కంటి, ఆర్థోపెడిక్ ,ఈఎన్టి, ఇసిజీతో సహా పలు రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, రామారావు, ఇఎన్టి ప్రసాద్, డాక్టర్ శ్యామ్, నవీన్, శ్రీనివాసరావు, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, పెదనాటి వెంకటేశ్వరరావు, మేకల వెంకట్రావు,బొల్లు రాంబాబు, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, ముత్తవరపు రామారావు, మల్లంపల్లి వెంకటేశ్వరరావు, బాలబోయిన వీరయ్య, వల్లూరి రవి, లక్ష్మయ్య, మిగడ లింగయ్య, వెంకటేశ్వర్లు, అనబత్తుల సుబ్బారావు, నంబూరు ప్రవీణ్, అప్పారావు, బాడిషా నరసింహారావు, కొండ సైదులు తదితరులు పాల్గొన్నారు.