Panikara liṅgayya : ప్రజా దీవెన, శాలిగౌరారం: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, నకిరేకల్ మాజీ సమితి ప్రసిడెంట్,ఎంసీపిఐయూ జిల్లా నాయకులు, కామ్రేడ్ పనికర లింగయ్య జీవితాన్ని భవితరాల వారు ఆదర్శoగా తీసుకోవాలని ఎంసీపిఐయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న అన్నారు.కామ్రేడ్ పనికర లింగయ్య రెండవ వర్ధంతి సందర్బంగా గురజాల లో అయన విగ్రహాన్ని, 40 పీట్ల స్మారక స్థూపాన్ని రాష్ట్ర నాయకులు ఆవిష్కరించారు. అనంతరం స్మారక బహిరంగ సభ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న మాట్లాడుతూ గురజాల గ్రామంలో జన్మించిన పనికరలింగయ్య చిన్నతనం నుండి కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై ఎర్రజెండ చేతబట్టి కామ్రేడ్ మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి, కామ్రేడ్ మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్, కామ్రేడ్ నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, కామ్రేడ్ కృష్ణమూర్తి దళములో కొరియర్ గా పనిచేసారన్నారు.మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి సహకారంతో నకిరేకల్ సమితి అధ్యక్షులుగా ఎన్నికై. దొరలకు భూస్వాములకు దోపిడీదారులకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన నిలబడి సీలింగ్,పోరంబోకు పంచరాయి భూములను పేద ప్రజలకు పంచి ప్రజల తరఫున నిలబడిన ప్రజానాయకుడు లింగయ్య అని వెంకన్న కొనియాడారు.ఆయన మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నలుగురి రమేష్ ఇంద్రకంటి లక్ష్మక్క,సోమగాని వెంకన్న,నర్షయ్య,పనికర కృష్ణ-విజయనిర్మల దంపతులు,రాజు,మాజీ ఎంపీటీసీ కోక యాదయ్య, కాంగ్రెస్ నాయకులు గూని వెంకటయ్య,చెరుపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు