Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Paper Leak : పేపర్ లీక్ లో రాజకీయం, నకిరేకల్ పీఎస్‌లో కేటీఆర్‌పై రెండు కేసులు

Paper Leak : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగా ణలో రాజకీయాలు రచ్చకెక్కుతు న్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం అరోపణలు, ప్రత్యారోపణలు వేగం పుంజుకుంటూ పోలీస్ స్టేషన్ ల మెట్లెక్కుతుండడంతో ప్రజలు ఇదేమి రాజకీయమంటూ ముక్కు న వేలేసుకుంటున్నారు. ఈ క్రమం లోనే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నకిరేకల్‌ పో లీస్‌ స్టేషన్‌లో రెండు వేర్వేరు కేసు లు నమోదయ్యాయి. స్థానిక కాం గ్రెస్‌ నాయకుల ఫిర్యాదు మేరకు కేటీఆర్‌తో పాటు సోషల్‌మీడియా ఇంచార్జిలు మన్నె క్రిశాంక్‌, కొణతం దిలీప్‌పై కేసులు నమోదు చేశారు.
నకిరేకల్‌ పదో తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులోని నిందితులతో తమకు సంబంధం లేకున్నా సోషల్‌మీడియా వేదికగా తమపై తప్పుడు ప్రచారం చేశారం టూ నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్‌ప ర్సన్‌ చౌగోని రజిత, మరో వ్యక్తి ఉగ్గిడి శ్రీనివాస్‌ వేర్వేరుగా నకిరేకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.

పేపర్ లీకేజీ కేసులోని నిందితు లతో తమకు సంబంధం ఉందం టూ తెలుగు స్క్రైబ్‌లో వచ్చిన కథ నాన్ని కేటీఆర్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో షే ర్‌ చేసినట్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.చౌగోని రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నెంబర్ 85/2025 నమోదు చేశారు. ఇం దులో ఏ 1గా మన్నె క్రిశాంక్, ఏ 2 గా కేటీఆర్, ఏ 3గా కొణతం దిలీప్ కుమార్‌లతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.

ఉగ్గిడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నెంబర్ 86/ 2025 ను నమోదు చేశారు. ఇందు లో ఏ1 గా కొణతం దిలీప్ కుమా ర్ , ఏ2గా మన్నే క్రిశాంక్, ఏ 3గా కే టీఆర్, ఏ4 గా తెలుగు స్క్రైబ్ ఎం డీ, ఏ5 గా మిర్రర్ టీవీ యూట్యూ బ్ ఛానెల్ ఎండీతో పాటు మరికొం దరిపైనా రెండు కేసుల్లోనూ 353 (1)(c), 353(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు నకిరేకల్ పోలీసులు తెలిపారు.