Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

pashamylaramfireaccident :పాశమైలారం స్థలిని పరిశీలించిన సీఎం రేవంత్, మృతులకు రూ. కోటి 

pashamylaramfireaccident :ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ వ్యా ప్తంగా సంచలనం సృష్టించి సంగా రెడ్డి జిల్లా పాశమైలారం ఘటనాస్థ లిని ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి పరిలిం చారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు తది తరులతో కలిసి ఆయన ప్రమాద ఘటన స్థలానికి చేసుకొని పరిస్థు లను ఆరా తీశారు. అనంతరం ఆయన మంత్రుల తో కలిసి మీడియాతో మాట్లాడారు.సీఎం వ్యాఖ్యలు ఆయన మాట ల్లోనే..ఇది అత్యంత విషాదకరమైన దుర్ఘటన. ఇప్పటివరకు ఇన్ని ప్రా ణాలను బలిగొన్న దుర్ఘటన రాష్ట్రం లో జరగలేదు. ఇప్పటి వర కు 36 మంది చనిపో యారు. 143 మంది ఉండగా 58 మందిని అధికారులు గుర్తిం చా రు. మిగిలిన వారిని గుర్తిం చేందుకు సహా యక చర్యలు కొన సాగుతున్నాయి.

 

చనిపోయిన కుటుంబాలకు మాన వతా దృక్పథంతో రూ.కోటి నష్ట పరి హారం ఇవ్వాలని అధికారులను ఆ దేశించారు. తీవ్రంగా గాయ పడిన వారికి రూ. 10 లక్షలు, పాక్షికంగా గాయపడినవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని సూచించారు. గాయపడి నవారికి మెరుగైన చికి త్సఅందించాలన్నారు.

ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక స్పష్ట మైన విధానంతో ముందుకెళ్తామ న్నారు.ఇలాంటి ఘటనలు జరగకుండా కం పెనీల్లో పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చే యాలని అధికారులను ఆదేశిం చాం. బాధిత కుటుం బాలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించేం దుకు చర్యలు తీసుకోవాలని ఆదే శించామన్నారు. సీఎం వెంట ఉన్నతాధికారులు ఉన్నారు.

సీఎం రేవంత్ మీడియా సమావేశం వివరాలు..సిగాచి రియాక్టర్ల పేలుడు ఘట నపై పూర్తి నివేదికను సత్వరంగా సమర్పించాలని అధికారులను ఆదే శించారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. ఈ దు ర్ఘటనలో మృతుల సం ఖ్య పెరుగు తున్న నేపథ్యంలో బాధి తుల కుటుంబాలకు మానవత్వం తో సహకరించాల్సిన బాధ్యత పరి శ్రమ యాజమాన్యం మీద ఉందని సీఎం స్ప ష్టం చేశారు.

అంతేగాక, ఘటనలో గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయా లని, బాడీలను ట్రేస్ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టా లని సూచించారు.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పాశ మైలారంలో జరిగిన సిగాచి రసాయన పరిశ్రమ సంఘటన స్థలానికి చేరుకుని పరిశ్ర మను స్వయంగా పరిశీలించారు ముఖ్య‌మంత్రి. సీఎంతో పాటు మం త్రులు శ్రీధర్ బాబు, దామోదర రా జనర్సింహ, వివేక్, పొంగులేటి శ్రీనివాస్ ఉన్నారు. పరిశ్రమ ప్రాంతాన్ని తనిఖీ చేసిన అనంతరం, సీఎం స్థా నిక అధికారులతో సమీక్ష నిర్వహిం చారు.సమీక్షలో భాగంగా పరిశ్రమ కు ఇ చ్చిన అనుమతులు, భద్రతా ప్రమాణాల అమలుపై సీఎం అధికా రులను ప్రశ్నించారు.

ఇక్కడ అను మతులు ఇచ్చే సమ యంలో పరిశీ లన జరిగిందా లేదా పరిశ్రమ బోర్డు స భ్యులు ఎవరూ, ఫ్యాక్టరీస్ డైరెక్ట ర్‌ పరిశ్ర మను తని ఖీ చేశారా వంటి కీలకమైన ప్రశ్నలు అడిగారు. ఇటు వంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకో వాలని, పరిశ్రమల్లో భద్ర తా ప్రమాణాలు తప్పనిసరిగా పా టించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రమాద నివార ణకు స్పష్టమైన యా క్షన్ ప్లాన్‌ రూపొందించాల్సిన అవసరం ఉంద ని స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో ప్రతి శాఖ సమన్వయంతో స్పందించాలి అని ఆయన పేర్కొన్నారు.

సిగాచి పరిశ్రమ నిబంధనలు పాటిం చిందా అని ప్రశ్నించారు. సిగా చి పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారా అని అడిగారు. ప్రమాదా నికి కచ్చితమైన కారణాలు తనకు తె లియాలి అని అధికారులకు ఆదే శాలు జారీ చేశారు. ప్రమాదంపై ని పుణులతో అధ్యయనం చేయించా లన్నారు. ప్రమాదానికి బాధ్యులైన పరిశ్రమ యాజమా న్యం స్పందించిం దా అని మరో ప్రశ్న వేశారు. ప్రమా దంపై సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదా లకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఊహాజ నిత జవా బులు కాకుండా వాస్తవా లను తెలపాలని అధికారులను ముఖ్య మంత్రి ఆదేశించారు. ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరి పించాలని, ఇప్పటికే పరిశీలిం చిన అధికారులతో కాకుండా కొత్త బృందంతో దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

యాజమాన్యంపై సీఎం ఆగ్రహం…సిగాచి యాజమాన్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతోందని.. ఘటనా స్థలికి యాజమాన్యం ఎందుకు రా లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బాధితులకు ఏం భరోసా ఇ చ్చారని నిలదీశారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాన్ని మాన వతాదృక్పథంతో చూడాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

ఆసుపత్రిలో క్ష‌త‌గాత్రుల‌కు రేవంత్ ప‌రామ‌ర్శ….పరిశ్రమను తని ఖీ చేసిన అనంతరం, సీఎం రేవంత్‌ రెడ్డి స్థానిక ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామ ర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకోన్నారు. ప్ర‌మాద వివ‌రాల‌ను అడిగి తెలు సుకున్నారు. ప్ర‌మాద బాధితుల‌కు, వారి కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అం డ‌గా ఉంటుందని భ‌రోసా ఇచ్చా రు. కాగా త‌క్ష‌ణ సాయంగా మ‌ర‌ణిం చిన వారి కుటుంబ స‌భ్యుల‌కు రూ ల‌క్ష‌, గాయ‌ప‌డిన వారికి రూ.50 వేలు ఇవ్వాల‌ని అధికారులను రేవంత్ ఆదేశించారు.

45కి చేరిన మృతుల సంఖ్య…ఇదిలా ఉండగా పాశమైలారం పే లుడు ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. ఘటనాస్థలిలో ఇం కా సహాయక చర్యలు కొనసాగు తున్నాయి. మృతుల సంఖ్య మ రింత పెరిగే అవకాశం ఉన్నట్లు స మాచారం. రెస్క్యూ ఆపరే షన్‌లో సింగరేణి టీమ్‌ పాల్గొంది. ప్రమాద సమయంలో 143 మంది పనిచేస్తు న్నట్లు గుర్తించారు. 34 మందికి తీ వ్రగాయాలు అవగా వారిని వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించి చికి త్స అందజేస్తు న్నారు. శిథిలాల కిం ద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దా దాపు 29 మృతదేహా లు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆరు మృత దేహాల గుర్తించారు. ఇంకా 17 మం ది ఆచూకీ గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి 57 మంది సురక్షితంగా బయటపడ్డారు.