అత్యవసర విభాగంలో సిబ్బంది అందుబాటులో ఉండాలి…
సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలి…
Collector Tejas Nandlal Pawar :
ప్రజాదీవెన, సూర్యాపేట : ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులపట్ల సిబ్బంది మర్యాదగా వ్వహరించాలని, వారు ఏ విభాగానికి వెళ్లాలొ తెలియజేసే విధంగా సిబ్బంది చెప్పెవిదంగా ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ నర్సింగ్ సూపర్డెంట్ రేణుక భాయ్ కి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో గల మాత శిశు ఆరోగ్య కేంద్రం ను కలెక్టర్ పరిశీలించారు. వివిధ విభాగాలకు సంబంధించిన గదులను పరిశీలించారు. రోజుకి ఎంతమంది గర్భిణీ స్త్రీలు వస్తున్నారు, వారిని రిజిస్టర్లో నమోదు చేస్తున్నారా లేదా పరిశీలించారు.
ఆసుపత్రి లో పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ తెలిపారు గర్భిణీ స్త్రీ తో పాటు వచ్చే అటెండెంటుకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు మెడికల్ సర్వీసెస్ చాలా బాగున్నాయని కానీ ఎం సి హెచ్ సిబ్బంది పేషెంట్ల పట్ల అమర్యాదగా వ్యవహరిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు అయితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సిబ్బందిని హెచ్వోడి వీరేక్షించాలని కలెక్టర్ తెలిపారు. మాత శిశు ఆరోగ్య కేంద్రానికి గర్భిణీ స్త్రీలను పరిశీలన నిమిత్తం తీసుకొని వచ్చిన గిరి నగర్ చెందిన ఆశాలు పారిజాతం, ఆదిలక్ష్మితో కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మొత్తం నలుగురు గర్భిణీలను పరిశీలన నిమిత్తమై తీసుకొని రావడం జరిగిందని వారు పేర్కొన్నారు. అమ్మ పాలన సహాయ కేంద్రం వద్ద గర్భిణీల నమోదు రిజిస్టర్ను పరిశీలించారు. మఠంపల్లి మండలానికి చెందిన బక్కపల్లి గ్రామవాసి బచ్చలకూర రూప మూడవ డెలివరీ కోసం ఆసుపత్రికి రావడం జరిగిందని ఇక్కడ సిబ్బంది సేవలు చాలా బాగున్నాయని కలెక్టర్కు వివరించారు. అనంతరం గర్భిణీలవార్డును పరిశీలించారు. అక్కడ చెరుకుపల్లి గ్రామాన్నించి వచ్చిన రమాదేవి కి సాధారణ ప్రసవం జరిగిందని బాబు పుట్టాడని సంతోషంగా కలెక్టర్కు తెలిపింది. రేపాల పిహెచ్ సి నుంచి మేక అనిత ఏడో నెల గర్భవతి జనరల్ చెకప్ కు తీసుకుని వచ్చిన ఆశలతో కలెక్టర్ మాట్లాడారు.
గర్భిణీలను జనరల్ చెకప్ కు తీసుకువచ్చి ఆశాలకు అన్ని సదుపాయాల ఉన్న ఒక విశ్రాంతి గది కేటాయించాలని హెచ్ ఓ డి కి కలెక్టర్ తెలిపారు. పేషంట్లతో వచ్చిన సహాయకులకు విశ్రాంతి కొరకు తాత్కాలిక షెడ్డు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ప్రధాన ఆసుపత్రిలోని అత్యవసర విభాగాన్ని పరిశీలించారు. ఈ విభాగంలోని సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం క్రిటికల్ కేర్ యూనిట్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ శ్రీకాంత్, గైనకాలజీ హెచ్ఒడి పద్మజ, నర్సింగ్ సూపర్డెంట్ రేణుక భాయ్ డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.