–స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్
నారాయణ అమిత్
Collector Narayana Amit :ప్రజాదీవెన నల్గొండ : గ్రంథాలయ సెస్ కింద వసూలు చేసిన మొత్తాన్ని క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ చలానా చెల్లించాలని స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్
నారాయణ అమిత్ మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులను ఆదేశించారు.
బుధవారం తన ఛాంబర్ లో గ్రంథాలయ సెస్ వసూలు, వినియోగంపై నిర్వహించిన సమీక్ష లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు వసూలు చేసే ఆస్తిపన్ను కు అదనంగా గ్రంథాలయ సెస్ లెవీని వసూలుచేసి గ్రంథాలయ సంస్థకు జమ చేయాల్సి ఉందని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ సెస్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం జమ చేయాలని ఆదేశించారు. దీని ద్వారా గ్రంధాలయాల అభివృద్ధికి కావాల్సిన పుస్తకాలు, భవనాల నిర్మాణం, విద్యుత్ బిల్లులు, వేతనాల చెల్లింపు, తదితర అవసరాలకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి. బాలమ్మ, జిల్లాలోని అందరు మున్సిపల్ కమిషనర్లు, ఆడిట్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి హాజరయ్యారు.