–హౌసింగ్ పీడీ రాజ్ కుమార్
PD Raj Kumar :ప్రజాదీవెన నల్గొండ : సేవా గుణంతోనే అధికారికి గుర్తింపు లభిస్తుందని హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ అన్నారు. దాదాపు మూడు సంవత్సరాల కాలం పాటు ఇంచార్జ్ డిటిడివో గా పని చేసిన రాజ్ కుమార్ కు శనివారం జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ పి ఎం హెచ్ గర్ల్స్ వసతి గృహంలో వార్డెన్ ల ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజకుమార్ మాట్లాడారు. వృత్తిలో నిబద్ధత, సేవలో అంకితభావం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేయడంలో నిబద్ధతతో చేసిన కృషి మరువలేనిదని అన్నారు. నిబద్ధతతో సేవ చేస్తే అధికారికి సమాజంలో తగిన గౌరవ మర్యాదలు, గుర్తింపు వాటంతటవే వస్తాయన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు రాజ్ కుమార్ సేవలను కొనియాడారు. అనంతరం ఇటీవలే నూతనంగా డిటిడిఓ గా బాధ్యతలు చేపట్టినమూడవత్ ఛత్రు కు స్వాగతం పలుకుతూ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏవో కే. పార్థసారథి, ఏసిఎంఓ డివి నాయక్, ఏటీడీఓ ఎం శ్రీనివాసులు,
రిటైర్డ్ సీనియర్ గ్రేడ్ వన్ హెచ్ డబ్ల్యూఓ కే. లక్ష్మారెడ్డి, టీఎన్జీవోస్ నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అలీమ్, సంయుక్త కార్యదర్శి కొల్లు బాలకృష్ణ, మినిస్ట్రియల్ స్టాప్ జనరల్ సెక్రెటరీ అతిక్, హెచ్డబ్ల్యూస్ అసోసియేషన్ సెంట్రల్ ఫోరం అసోసియేటెడ్ అధ్యక్షుడు బి. లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు టి. వెంకటేశ్వర్లు,జిల్లా హెచ్ డబ్ల్యు ఓస్ యూనియన్ కోశాధికారి సైదా నాయక్, టీచర్ల సంఘం జనరల్ సెక్రెటరీ డి. బాలాజీ, హనుమ కుమారి, పద్మ, కృష్ణవేణి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి మణికుమార్, కృష్ణయ్య, శివకుమార్, మినిస్ట్రియల్ స్టాప్ అండాలు, రేణుక, వసతి గృహ సంక్షేమ అధికారులు ఈ. శేఖర్ రెడ్డి,సంధ్య, అహల్య, శ్రీనివాస్ రెడ్డి, వీరాంజనేయులు, రామకృష్ణ, స్పోర్ట్స్ ఆఫీసర్ మహేష్, చెంచు సేవా సంఘం అధ్యక్షులు ఎం. లక్ష్మయ్య, లింగయ్య, రమణమూర్తి యాదవ్, పాండు, ముంతాజ్, నవీన్, గ్రేడ్ వన్ హెచ్ డబ్ల్యూ కే. రమేష్ కుమార్, డి. రమేష్, పుల్యా, సతీష్ కుమార్, ఎం. శ్రీనివాస్
డైలీ వేజ్ సిబ్బంది ఎం. సతీష్ కుమార్, సురేందర్, ధర్మేందర్, బాలాజీ, యాదమ్మ, లింగమ్మ, నాగశేషమ్మ, అండాలు, పిఎం హెచ్ గర్ల్స్ క్యాంపస్ నిర్వాహకురాలు ఎం. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.