కొనుగోలు విషయంలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పోలీస్ కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు.
PD Sekhar Reddy: ప్రజా దీవెన కనగల్.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Grain buying centres) రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిడి శేఖర్ రెడ్డి (PD Sekhar Reddy), పలువురు అధికారులు అన్నారు మంగళవారం మండలంలోని పర్వతగిరి కనగల్ ,బుడుమర్లపల్లి, ఎడవెల్లి, కురంపల్లి ,షాప్దలాపురం, పగిడిమర్రి ,దోరేపల్లి వివిధ గ్రామాలలో ఐకెపి కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు కొనుగోలు కేంద్రాలలో రైతులకు (farmer) ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు గన్ని బ్యాగులు చక్కగా ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టాలన్నారు ప్రభుత్వం సన్న రకంధాన్యానికి కింటల్ కు 500 బోనస్ ఇస్తుందని అలాగే వాటి కోసం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కనగల్ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైతులు (farmer) తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు రైతుల పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని అన్నారు. .. ఈ కార్యక్రమంలో అధికారులు తహసిల్దార్ పద్మ, సుమలత ,ఏపిఎం హరి, నాయకులు అనుప రెడ్డి, మాజీ జెడ్పిటి శ్రీనివాస్ గౌడ్, గోలి జగాల్ రెడ్డి, నర్సింగ్ సునీత కృష్ణయ్య గౌడ్ వెంకటరెడ్డి ,సీసీలు విజయ, వసంత, రైతులు ,నాయకులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.