PDSU : ప్రజా దీవెన, కోదాడ:అక్టోబర్ 20న కోదాడ లో,24న హైదరాబాదులో జరిగే PDSU అర్ధ శతాబ్దోత్సవ సభలను జయప్రదం చేయాలనీ కోరుతూ బుధవారం KRR డిగ్రీ కాలేజ్ సెంటర్ నందు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా
పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి మ్ చందర్ రావు (Chander Rao)మాట్లాడుతూ. 50 ఏండ్ల విప్లవ ప్రస్థానంలో విద్యార్థుల పక్షాన PDSU నిలబడి విద్యార్థుల విద్యా హక్కుల కోసం వీరోచితంగా పోరాడిందని దున్నేవారికే భూమి నినాదంతో మన దేశంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్బరి ,శ్రీకాకుళం, గోదావరిలోయ పోరాటాలతో ప్రభావితమైన ఉస్మానియా విద్యార్థులు కామ్రేడ్ జార్జి రెడ్డి నాయకత్వంలో PDS ను ఏర్పరిచారని. అప్పటివరకు ఉస్మానియాకే పరిమితమైన PDS జార్జిరెడ్డి వీరమరణంతో 1974లో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నేతృత్వంలో PDSU ఏర్పడిందని. 1975 జున్ 15, నుండి 19 రాష్ట్ర మొదటి కౌన్సిల్ కోదాడలో ఐదు రోజులపాటు జరుపుకుంది. సరిగ్గా 2024 అక్టోబర్ నాటికి 50 ఏళ్లు నిండుతున్నాయని వారు అన్నారు.
దేశానికి అధికార మార్పిడి జరిగి ఏడు దశాబ్దాలు దాటిన ఇంతవరకు పేదవారికి విద్య,వైద్యం,ఉపాధి (Education, medical, employment) దొరకడం లేదని అన్ని రంగాలలో అసమానతలు పెరుగుతున్నాయని పాలకులు మారుతున్న వారి స్వభావం వారి విధానాలు మారడం లేదని ముఖ్యంగా బీజేపీ గత 10 ఏండ్లుగా పచ్చి మతోన్మాద కార్పొరేట్ విధానాలను అవలంబించిందని. దేశ భవిష్యత్తును కార్పొరేట్ వ్యవస్థల చేతుల్లో పెట్టి విద్యను ప్రైవేటీకరణ కార్పొరేటీకరణచే (Privatization by corporatization) సిందని వారు అన్నారు.ఆ ద్వంశమవుతున్న ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు, కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020 ను వ్యతిరేకించాలని, అందరికీ సమానమైన శాస్త్రీయమైన విద్య కోసం పోరాడాలని వారు అన్నారు. PDSU పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని , అమరవీరుల ఆశయాలను ఎత్తి పడుతూ సంస్థ ఆవిర్భవించి 50 ఏళ్లు నిండిన సందర్భంగా 2024 అక్టోబర్ 20న కోదాడ, 24న హైదరబాద్ లో జరగబోయే PDSU అర్థ శతాబ్ద ఉత్సవ సభలకు,పూర్వ, ప్రస్తుత విద్యార్థులతోపాటు PDSU నాయకులు,మేధావులు అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు పులి రాఖి, వేణు, గౌతమ్, సంధ్య, స్వప్న, మౌనిక, జ్యోతి, రాణి, రాధిక ,మౌనిక, సైదమ్మ ,జరిన ,రేష్మ, తదితరులు పాల్గొన్నారు