–యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ తో యూట్యూబర్ కు అరదండాలు
Peacock curry:ప్రజా దీవెన, హైదరాబాద్: జాతీయ పక్షి నెమలి కూరను (Peacock curry) ఎలా వండాలో వివరించి కటకటాలు లెక్కపెడుతు న్నాడు సిరిసిల్లకు చెందిన ఓ యూ ట్యూబర్. సిరిసిల్లలోని తంగళ్లపల్లికి చెందిన కోడం ప్రణయ్ కుమార్ సం ప్రదాయ వంటకాలపై వీడియోలు (Videos on recipes) చేసి శ్రీటీవీ అనే యూట్యూబ్ చానెల్లో అప్ లోడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో శని వారం సాంప్రదాయ పద్ధతిలో నెమలి కూర (Peacock curry)ఎలా వండా లో చూడండి అంటూ ‘ట్రెడిషనల్ పీకాక్ కర్రీ రెసిపీ’ అన్న పేరుతో యూట్యూబ్ లో వీడియో అప్ లోడ్ చేశాడు. దీనిపై జంతు ప్రేమి కుల నుంచే కాకుండా సామాన్యుల నుంచి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్త మైంది. దీంతో వెంటనే స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోను తొల గించింది.
కానీ అప్పటికే ఓ 140 మందికి పైగా ఆ వీడియో చూశారు. అతడే నిషేధిత జాబితాలో ఉన్న అడవి పంది కూర ఎలా ఉండాలో కూడా వీడియో తీసి ఇంతకుముం దు అప్లోడ్ చేశాడు. వన్యమృగా లను, జాతీయ పక్షిని వేటాడం నేరమని తెలిసి కూడా వాటిని చంపి కూర వండటమే కాకుండా ఆ వీడి యోలను అప్లోడ్ చేయడంపై జంతు ప్రేమికులు మండిపడుతు న్నారు. ఈ విష యం తెలిసిన సిరి సిల్ల ఫారెస్ట్ అధికారులు ప్రణయ్ కుమార్ అదుపులోకి తీసుకు న్నారు. అతని వద్దనుంచి నెమలి కూర వీడియోను స్వాధీనం చేసు కున్నామని ఎఫ్ ర్వో కల్పనాదేవి చెప్పారు. అతని వద్ద స్వాధీనం చేసుకున్న కూరను ల్యాబ్ టెస్ట్ (Lab test) పంపించామని తెలిపారు.