Peasant Labor Union: ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని స్థానిక లాల్ బంగ్లాలో (Lal Bungalow) బుధవారం ప్రజా సంఘాల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిలభారత రైతు కూలీ సంఘం (Peasant Labor Union)రాష్ట్ర అధ్యక్షులు వి. కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ 78 సంవత్సరాల స్వరాజ్యంలో 80 కోట్ల మంది ప్రజలు పేదరికపు ఆగాధంలో కొట్టుమిట్టాడుతున్నారని మరోవైపు పిడికెడు మందిగా ఉన్న అంబానీ ఆదాయం (Ambani Income) మన జాతీయ ఉత్పత్తిలో 10% గా ఉంది మిగతా ఆదాని, బిర్లా, టాటా తదితరుల ఆదాయం కలిపితే 50 శాతానికి ఉంటుంది. నేడు మన దేశం అప్పు 181లక్షల68,వేల456 కోట్ల రూపాయలు దీన్ని మన దేశ జనాభా కు పంచితే ఒక మనిషికి 1,లక్ష18 వేల రూపాయలు పడుతుందని, ఈ అప్పులపై ప్రతి సంవత్సరం వడ్డీ 11లక్షల62,వేల940 కోట్ల రూపాయలు చెల్లించవలసి వస్తుంది, మన దేశ బడ్జెట్ 48 లక్షల20 వేల 512 కోట్ల రూపాయలు, దేశ బడ్జెట్ కంటే అప్పు 62% పైగా ఉన్నదంటే మన ఆర్థిక విధానానికి మరణశాసనం రాసినట్లే అని అన్నారు.
రాబడి లేక ప్రతి 30 సెకండ్లకు ఒక రైతు ఆత్మహత్య (Farmer suicide)చేసుకుంటున్నారు, ఇప్పటికీ సమాన పనికి అసమాన వేతనమే అందుతుందన్నారు. నేటి పాలకులు అన్ని వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకోవడంతో సుప్రీంకోర్టు సైతం నోరు మూసుకుంటుందని, మీడియా మొత్తం మోడీయా మయంగా తయారయింది, అమెరికా, రష్యాలు (America and Russia)మన దేశాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకొని మన పాలకులను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి, పబ్లిక్ రంగాలన్నీ నష్టాల పేరుతో ప్రైవేటీకరణ వైపు పరుగులు తీస్తున్నాయి, కార్మికుల పై 4 లేబర్ కోడ్ లను రుద్ది 12 గంటల శ్రమ చేయిస్తున్నారు. మన దేశాన్ని ఒకరకంగా తాకట్టులో భారత్ నుంచి అమ్మకానికి భారత్ గా భావిస్తున్నారు. మన దేశాన్ని రక్షించుకోనుటకు,మన వ్యవసాయం, మన ఫ్యాక్టరీలను సామ్రాజ్యవాద కార్పొరేటర్ విషపు కౌగిలి నుండి కాపాడుకొనుటకు అందరూ ఐక్యం కావలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐ కేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం డేవిడ్, అధ్యక్షులు ఫోటో లక్ష్మయ్య ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు నాగయ్య ఉదయగిరి సైదులు నరసింహారావు పి డి యస్ యు రాష్ట్ర అధ్యక్షులు పి కిరణ్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు