Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pending BAS Bills : బిఏఎస్ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

Pending BAS Bills  : ప్రజాదీవెన నల్గొండ :  రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు లాటరీ ద్వారా ఎంపిక చేసి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా ప్రైవేటు విద్యాసంస్థల్లో చేర్పించిన విద్యార్థులకు సంబంధించిన ఫీజు బుక్స్ తదితర సౌకర్యాల బిల్లులు ప్రభుత్వం వెంటనే ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.
మంగళవారం సుందరయ్య భవన్ లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి లాటరీ ద్వారా ఎంపిక చేసి ప్రైవేటు విద్యా సంస్థలకు బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా పంపుతున్న విద్యార్థులకు ప్రభుత్వము నుండి 4 సంవత్సరాలుగా రావలసిన బిల్లులు ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవ్వకపోవడంతో ఆ విద్యార్థులను స్కూలుకి రానివ్వకుండా, బుక్స్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

 

ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇచ్చేవరకు తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రైవేటు విద్యాసంస్థలతో మాట్లాడి విద్యార్థుల విద్య కొనసాగే విధంగా, బుక్స్ వెంటనే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు పేద విద్యార్థులకు 25 శాతం విద్యానందించాలనే నిబంధన పాటిస్తున్నాయా లేవా అని విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజు నియంత్రణ లేకుండా తమ ఇష్టానుసారం డొనేషన్ల పేరుతో, ట్యూషన్ ఫీజు పేరుతో బుక్స్ యూనిఫామ్ అమ్ముతూ పేదల నుండి జలగల్లా పట్టి పీలుస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజు చార్ట్ ను స్కూలు బయట ప్రదర్శించాలని స్కూల్ ప్రాంగణంలో ఇతర వ్యాపార వ్యవహారాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, దండెంపల్లి సరోజ, గాదె నరసింహ, ఆవుట రవీందర్ తదితరులు పాల్గొన్నారు.