Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Penitentiary Employees Union: తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నిరవధిక సమ్మె

ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్గొండ జిల్లా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయము ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులుగా రాష్ట్రవ్యాప్తంగా 19300 మంది నల్గొండ జిల్లాలో దాదాపుగా 1100 మందిని వివిధ విభాగాలుగా పనిచేస్తున్నాం.

మేము గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నాము. అయినా మాకు సరైన వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నాం. గత సంవత్సరం అంతా 13/09/2023 న హన్మకొండ లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు విద్యా శాఖ లోని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల అందరిని రెగ్యులర్ చెయ్యాలని ఆ లోపు తక్షణమే పే స్కెల్ అమలు చెయ్యాలని డిమాండ్

20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురి అవుతున్నామని, మా యవ్వనం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని, పెరిగిన నిత్యావసర ధరల వలన బ్రతకలేక చస్తున్నామని ఆవేదన, భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి – సమాన వేతనం వెంటనే అమలు చెయ్యాలని వేడుకుంటున్నారు
మా యొక్క న్యాయమైన డిమాండ్లు.
సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. అప్పటివరకు పే స్కేల్ అమలు, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలి.
సమగ్ర శిక్ష ఉద్యోగులలో 61 సంవత్సరాల నుండి పదవి విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ కింద 25 లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలి.

సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రి ఎంగేజ్ విధానాన్ని ఎత్తివేయాలి.1100 ఉద్యోగులలో దాదాపుగా 800 మంది ఉద్యోగులు ఈ కార్యక్రమానికి ప్రతిరోజు హాజరవుతూ ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు మా నిరవధిక దీక్షను ఇలాగే కొనసాగిస్తామని సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొలుగూరి కృష్ణ మరియు బొమ్మగాని రాజులు తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వాణాలు రాష్ట్ర ప్రతినిధులుగా రాష్ట్ర అసోసియే ప్రెసిడెంట్ క్రాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి కంచర్ల మహేందర్, సలహాదారులు డి. నీలాంబరి పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్ కొండ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి. సావిత్రి, కోశాధికారి పుష్పలత, సాయిల్, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు.,ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, ధార వెంకన్న, శ్రీనివాస్, ఎర్రమల నాగయ్య, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు.కలెక్టర్ ఆఫీస్ నందు జరిగిన సమ్మెకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలపడం జరిగింది.

టీఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు బి శ్రీనివాసచారి, తపస్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, బత్తిని భాస్కర్ గౌడ్,ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు నరేశ్, శేఖర్ తమ మద్దతు తెలియజేసి సంఘీభావం తెలిపారు.