Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Pentayah: కోదాడ పట్టణం ప్రాంతీయ పశు వైద్యశాలను సందర్శించిన డా సుబ్బరాయుడు.

*సాదరంగా స్వాగతం పలికిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య

Pentayah: ప్రజా దీవెన ప్రజా, కోదాడ: పట్టణములోని స్థానిక ప్రాంతీయ పశు వైద్యశాలను (Veterinary Hospital)ఆదివారం తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల సమైక్య మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారాయుడు (Director Dr. Subbarayudu) సందర్శించారు ఈ సందర్భంగా కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య సాదరంగా స్వాగతం పలికి పూలమాల శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ పశువుల్లో కృత్రిమధారణకు (సెక్స్ సార్టెడ్ సెమెన్) ఆడదూడలకు మాత్రమే జన్మనిచ్చే పశువుల వీర్య నాళికలు వాడకం పై పశుపోషకులకు విస్తృత అవగాహన కల్పించాలని , తద్వారా మగ దూడల సంతానం తగ్గి పశుపోషకులకు మంద అభివృద్ధి చెందే ఆడదూడలు మాత్రమే పుడతాయని , మగదూడల పోషణ భారం తగ్గి లేగ దూడలతో. మరింత లాభసాటిగా పశుపోషణ ఉంటుందని స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ కి సూచించారు అనంతరం ప్రాంతీయ పశు వైద్యశాలలో మొక్కలు నాటారు కార్యక్రమములో. తమ్మరం పశువైద్యాధికారి డా. రమేష్ నాయక్ , సిబ్బంది రాజు , సాగర్ తదితరులు పాల్గొన్నారు.