Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

People Opinion : తాడోపేడో తేల్చుకోవాలన్నదే ప్రజల ఉద్దేశం

–పాకిస్తాన్ తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలి

–పాకిస్తాన్ ప్రభుత్వ నేతల మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి

–కుల గణన చేపట్టాలన్న కేంద్రం నిర్ణయని స్వాగతిస్తున్నాం

–కాంగ్రెస్ విలన్ అని మాజీ సిఎం కేసీఆర్ అనడం అర్థరహితం

–రాజ్యాంగం ప్రకారం చట్టసభలే సుప్రీం

People Opinion : ప్రజాదీవెన, నల్గొండ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో తాడోపేడో తేల్చుకోవాలన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పాకిస్తాన్ తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదులు, వారి నాయకులను అప్పగించాలి.

పాకిస్తాన్ ప్రభుత్వ నేతల మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. జనగణనలోనే కుల గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో సామాజిక నేపథ్యాల కారణంగా కులాల రిజర్వేషన్ అమల్లో ఉంది.ఈ అంతరాన్ని ఎలా తొలగిస్తారో క్లారిటీ ఇవ్వాలి. ముందుగా కుల గణన చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. 2014 పునర్విభజన చట్టంలో నియోజకవర్గాల పునర్విభజన అమలు చేస్తామని హామీనిచ్చారు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ లో చేశారు. కానీ విభజన చట్టం ప్రకారం అవకాశం ఉన్నా తెలంగాణ, ఏపీ లో ఇప్పటి వరకు చేయలేదు. తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది. 2026 కులగణన తరవాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది అని సుప్రీంకోర్టు కు చెప్పింది. తమకు ఇష్టమైన రాష్ట్రంలో ఒకతీరుగా.. ఇష్టం లేనీ రాష్ట్రం లో మరో తీరుగా కేంద్రం వైఖరి ఉంది. పదవులు, అధికారులు ఎవరికీ శాశ్వతం కాదు. చాలా సందర్భాల్లో ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోంది. ప్రోటోకాల్ వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలి. ఎటువంటి అనుమానం లేకుండా త్వరలోనే ఎస్ఎల్ బి సి ప్రాజెక్టు పూర్తి అవుతుంది. టన్నెల్ ప్రమాదం వల్ల కొంత అలస్యం జరిగే అవకాశం ఉంది.
తెలంగాణ కు కాంగ్రెస్ విలన్ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం అర్థరహితం.

ఆనాడు నేను ఎంపీగా పార్లమెంట్ లో ఉన్నపుడు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని స్వయంగా కేసీఆర్ చెప్పారు.
కేసీఆర్ పోరాటాన్ని కూడా కాదనలేము.
అందుకే ప్రజలు పదేళ్లు అధికారాన్ని కూడా ఇచ్చారు. కానీ అందరి పోరాటాన్ని గుర్తించాలి.
ఆనాడు లోక్ సభలో మేము 12 మంది సభ్యులు ఉంటే.. బిఆర్ఎస్ నుండి ఇద్దరే సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో కేసీఆర్ పాత్ర, సోనియాగాంధీ పాత్ర, సుష్మా స్వరాజ్ పాత్ర ను కాదనలేం. తెలంగాణ ప్రజలు విశ్వాసం కలిగినవారు.దానిని పోగొట్టొద్దు..రాజ్యాంగం ప్రకారం చట్టసభలే సుప్రీం అని పేర్కొన్నారు.