–డీఎంహెచ్ఓ శ్రీనివాస్
DMHO Srinivas : ప్రజాదీవెన నల్గొండ :పీహెచ్సీ, ఎన్టిఈపి సిబ్బంది తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ సూచించారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాలోని పిహెచ్సీ, ఎన్టిఈపి సిబ్బంది, సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల తో సమావేశమై టీబి ప్రోగ్రామ్ పనితీరును పీహెచ్సీలు, డివిజన్ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కొంతమంది సిబ్బంది పనితీరులో వెనుకబడ్డారని త్వరలోనే మరొక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ సమావేశంలోగా వారు పనితీరును మెరుగుపరుచుకోవాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.