Phule Jayanti : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: భారత దేశంలో నిమ్న వర్గాలకు విద్యను అందించి సమాజ అభివృద్ధికి బా టలు వేసిన మార్గదర్శి మహాత్మా జ్యోతిబాపూలే అని కుల వివక్ష వ్య తిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, చేతివృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ అన్నా రు. శుక్రవారం దొడ్డి కొమరయ్య భ వనంలో మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ1827 ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిబాపూలే జన్మించా రని అంటరానితనం కుల వివక్షత అనిచివేతలకు వ్యతిరేకంగా ఉద్య మించిన సంఘసంస్కర్త జ్యోతి బా పూలే అని అన్నారు.
మహాత్మ జ్యో తిబాపూలే విద్య యొక్క ప్రాధాన్యత తెలుసుకొని తన భార్య సావిత్రి బాయి పూలేకు విద్య నేర్పించి పాఠశాలలు స్థాపిం చి బహుజనులకు నిమ్న జాతుల కు విద్యాదానం చేసిన సంఘసం స్కర్తలని అన్నారు. ఎన్ని ఆటంకా లు వచ్చినా బ్రాహ్మణుల సమాజం నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా వెనకడుగు వేయలేదని అన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు. వితంతువుల హక్కు ల కోసం వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు.
విద్యను అందించడమే కాదు వారి కి సౌకర్యాలు కల్పించడంలో కృషి చేశారు మత ఉన్మాదం మనుషుల మధ్య చీలికలు తెచ్చే మనస్మృతికి వ్యతిరేకంగా సత్యశోధకు సమాజా న్ని స్థాపించి దాని ద్వారా అనేక వి లువలు నేర్పిన మహా వ్యక్తి జ్యోతి బాపూలే అన్నారు. గులాంగిరి పుస్త కాన్ని రచించి బ్రాహ్మణుల అమాను ష సూత్రాలను వ్యతిరేకంగా శూద్రు లు అతిశూద్రులపై బ్రాహ్మణుల క్రూ రమైనటువంటి వైఖరి హింసకు వ్య తిరేకంగా పోరాడారు సహపంక్తి భో జనాలకు కృషిచేసి కుల నిర్మూలన కు పోరాడారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్ పట్టణ మండల నాయకులు పరిపూర్ణాచారి బొల్లు రవీందర్ అద్దంకి నరసింహ పోలే సత్యనారాయణ అవుతా రవీందర్ ఊట్కూరు మధుసూదన్ రెడ్డి బొంగురాల వెంకటయ్య ఆదిమల్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు