–తెలుగు రాష్ట్రాల సింహాలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు
–కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు
Piyush Goyal: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి బరాబర్ ఆదరణ పెరుగుతోందని కేంద్రమంత్రి పీఈష్ గోయల్ పేర్కొన్నారు. తెలం గాణలో బీజేపీకి మద్దతు పెరిగింద ని గతంలో 4 లోకసభ , 3 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఈసారి 8 లోక్‌సభ, 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవ డం అభినందనీయమని కేంద్ర వాణి జ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూ ష్ గోయల్ అన్నారు. తెలుగు రాష్ట్ర సింహాలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర అభివృద్థికి కృషి చేస్తారని చెప్పారు. ప్రధాని మన్‌కీబాత్ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన చాంద్రాయణగుట్ట నియోజకవర్గం కందికల్‌గేట్ ఇస్కాన్ నందనవ నంలో వీక్షించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ మన్‌కీబాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోకసభ స్థానంలో వీక్షించడం అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. తెలుగు రాష్ట్రాల దిగ్గజం మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్యనాయుడు 75వ జన్మ దినం పురస్కరించుకొని ఆయ న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ అరుణ, పండరీనాథ్ తదితరులు పాల్గొన్నారు.