Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 1:53 pm Posted by : prajadeveena.com

Plantation Drive Nalgonda: చెట్లు నరికితే, పంట అవశేషాలు కాల్చితే క్రిమినల్ చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

Plantation Drive Nalgonda: పర్యావరణ పరిరక్షణపై నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ (collector b.chan dra sekhar) కీలక హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల్లో చెట్లను నరికివేయడం, పంట అవశేషాలను కాల్చడం వంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భా గంగా చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో నిర్వ హించిన గ్రామసభలో (Gram Sabha Meeting) ఆయన పాల్గొన్నారు. పర్యావరణ వారోత్సవాల సందర్భంగా జూన్ 12 వరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రజలకు పిలు పునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని సూచించారు.

గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. అ లాగే పంట అవశేషాలను కాల్చితే రూ.5 వేల జరిమానా వి ధిస్తామని, ఇతర రైతుల పంటలకు నష్టం కలిగేలా కాల్చితే రూ.25 వేల వరకు జరిమానా విధించడమే కాకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

Nalgonda District Collector Chandrasekhar addressing a gram sabha during Environment Week and warning against tree cutting and crop residue burning

గ్రామాల పరిశుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. చెత్తను రోడ్లపై వేయకుండా ప్రత్యేక చెత్త బుట్టలను వినియోగించాలని, స్వచ్ఛ గ్రామాలుగా నిలవాలని కోరారు. వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవడం ద్వారా డెంగ్యూ వంటి వ్యాధులను నివారించవచ్చని వివరించారు.

Also Read:Telangana Anganwadi Breakfast Scheme: అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకం.. ఈ నెల 12 నుంచి ప్రారంభం

రైతులకు సూచనలు చేస్తూ తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో కందులు, పెసర్లు, మినుములు వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను సాగు చేయాలని సూచించారు. తాగునీటి నాణ్యతను గ్రామస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం, మహిళా సంఘాల రుణాలు, ఉపాధి హామీ పనులు, విద్యార్థుల ఉన్నత విద్య, మహిళల ఆర్థిక సాధికారత వంటి అంశాలపై కూడా కలెక్టర్ మాట్లాడారు. అనంతరం గ్రామంలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి కుటుంబం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.