–చాలాకాలంగా చక్కర్లు కొడుతో న్న ఊహాగానాలు
–తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అవుతోన్న తాజా పరిణామాలు
–రాజకీయ పునరేకీకరణకు తెర తీ స్తుదoటున్న విశ్లేషకులు
–నిశితంగా పరిశీలిస్తున్న రాజకీ య పార్టీలు
PM Modi : ప్రజాదీవెన, హైదరాబాద్: భారత ప్రధాని మోదీతో మోగాస్టార్ చిరం జీవి బంధం పై రకరకాల ఊహాగా నాలు చక్కర్లు కొట్టడం ప్రారంభ మైంది. సంక్రాంతి సంబరాల సంద ర్భంగా ప్రధాని మోడీ, మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై ఆసీనులై కనిపించడం తద్వారా కనువిందు చేయడమే తారాస్థాయిలో ఊహా గానాలకు తెరలేపింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి కేషన్ రెడ్డి ఇంట్లో జరి గిన వేడుకలకు ముఖ్య అతిధిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి అతిధిగా మెగాస్టార్ చిరంజీవి కూడా రావడం ఆద్యం తం ఈ ఇద్దరు అక్కడ గడిపిన తీరు చర్చకు అవకాశం కల్పిం చింది. రాజకీయ, సినీ, క్రీడా రంగా లకు చెందిన ఎందరో ప్రముఖులు కిషన్ రెడ్డి ఇంట్లో సందడి చేసినా, ప్రధాని మోదీ, చిరంజీవి భేటీ కావడం, పరస్పరం ఆత్మీయంగా పలకరించుకోవడం ప్రత్యేక ఆకర్ష ణగా నిలిచిందనడంలో అతిశ యోక్తి లేదు.
ప్రధాని, చిరంజీవి కలిసి ఉన్న సందర్భాల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న తీరు రాజకీయ ప్రాధా న్యతకు సంతరించుకుంది. అయి తే ఎన్నడూ లేనట్లు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సం క్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మం త్రులు, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి మెగా స్టార్ చిరంజీవితో పాటు టెన్నిస్ స్టార్ సింధు, తేజ సజ్జా, ప్రముఖ గాయని సునీత తదితరులు హాజరయ్యారు. వేడుకలకు వచ్చిన వారందరినీ ప్రధాని ప్రత్యేకంగా పలకరించారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని చూడ గానే ఆలింగనం చేసుకున్నారు.
గతంలో ఏపీలో చంద్రబాబు ప్రభు త్వం కొలువుదీరిన సందర్భంలో నూ మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని విపరీతమైన ప్రాధాన్యమిచ్చారు. వేదికపై చిరంజీవి, ఆయన సోద రుడు, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో కలిసి ప్రజల కు అభినందనలు తెలిపారు. ఆ సోదరులివురి పట్ల బాహటంగానే పత్యేక శ్రద్దను కనపరిచారు. ఇప్పు డు కూడా సంక్రాంతి వేడుకలు ప్రారంభ సమయంలో తనతోపాటు చిరంజీవికి ఆ కార్యక్రమాలొ భాగ స్వామ్యం కల్పించారు. తన పక్కనే ఉన్న సీటుపై కూర్చోపెట్టుకుని వేడుకలు తిలకించారు.ఏ
పీలో కూటమి ఏర్పాటుకు, జనసేనకు పోటీ చేసిన అన్ని నియోజక వర్గా ల్లో విజయం సాధించడానికి పవన్ కళ్యాన్ తోపాటు తెరవెనుక చిరం జీవి క్రియాశీలకంగా వహించారనే ఆబిప్రాయంలోనూ ప్రధాని మోది ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వమే కేంద్రంలో తనకు మద్దతు గా నిలిచింది. కేంద్రంలో మోది ప్రభుత్వ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, జనసేన ఎంపీలు ప్రధాన కారణం కావడంతో రాష్ట్ర అవసరాలు తీర్చడంలో ప్రధాని అన్ని సమయాల్లోనూ ముందు ఉం టున్నారు. ఈ నేపధ్యంలోనే జరిగిన సంక్రాంతి కార్యక్రమానికి హాజ రైన ప్రధాని చిరంజీవి పట్ల ప్రత్యేక శ్రద్ద కనిపరిచారు.
చిరంజీవితో కలిగిన ఈ బాండింగ్ ఎటునుంచి ఎటువైపునకు వెళుతుందోనని అన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చిరంజీవి మనస్తత్వం తెలిసిన సినీ ప్రముఖులైతే ఇక ఆయన రాజకీయ జీవితానికి తెరపడినట్టేనని చెబుతున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలో ఎవరు ఎంత ప్రాధాన్యత ఇచ్చినా, ఎటువంటి పదవులు ఇస్తామని ఆశ చూపినా, ఆయన రాజకీయాల వైపు ఆకర్షితులు కారనే చెబుతున్నారు. సినీ రంగంలో ఆయనకు పాత్రలు తగ్గినా, సినిమాలు తగ్గినా ఇక్కడే ఉండిపోతారని, కుమారుడు రామ్ చరణ్ భవితవ్వానికి సమయం కేటాయిస్తారని చెబుతున్నారు.
మరోవైపున చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిం ది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అని, ఇయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని చెబుతున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. ఇక బిజీపే ఏపీలో తన పార్టీని మరింత పటిష్టం చేయాలనే ఆలోచనలో ఉంది. ఇందుకు చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ లను ఉపయోగించుకోవాలనే భావనలో ఆ పార్టీ ఉంది. పవన్ కళ్యాన్, చిరంజీవిలు బిజేపీతో కలిసి ప్రయాణం చేస్తే ఏపీలో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతాయనే భావన రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. అయితే కాలమే దీనికి సమాధానం చెబు తుందని పలువురు భావిస్తున్నా రు.