Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

POCSO ACT: మెతుకు సీమలో చీదరింపు ఘటన..ముక్కుపచ్చలారని బాలికపై లైంగికదాడి

ప్రజాదీవెన, మెదక్: మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకోగా..
గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్‌ జిల్లాకు చెందిన మూడున్నరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ ఆటో డ్రైవర్. అబ్బాస్(40) పిల్లికొట్టాల్లో పలుమార్లు చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అయితే.. తాజాగా మూడున్నరేళ్ల బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటనపై తల్లిదండ్రలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని.. నిందితున్ని అరెస్ట్ చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బాలికపై లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ ను పోలీసులు జైలుకు పంపారు.