బిగ్ బ్రేకింగ్, పోక్సో కేసులో నిందితుడికి పదేళ్ల శిక్ష
Pocsocase: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసు లో నిందితుడికి పదేళ్ల కఠిన కారా గార శిక్ష విధించింది న్యాయస్థానం. పహడి షరీఫ్ లో తన సోద రుడితో కలిసి వీధిలో ఆడుకుం టున్న ఒక మైనర్ బాలుడితో అసహజ రీతిలో, ఒక వ్యక్తి అస భ్యకరంగా ప్రవర్తించిన సంఘటన 2019లో Cr.NO 521/2019 కేసు నమోదయింది.
నిందితుడు మొహమ్మద్ ఇద్రీస్ కు కోర్టు శిక్ష విధించింది. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో U/S 377 IPC, & Sec 8 ఆఫ్ పోక్సో చట్టం మరియు పహాడి షరీఫ్ స్టేషన్ SC NO 95/2021, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం ఎల్బినగర్ లోని రంగారెడ్డి జిల్లా గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి పూర్తి స్థాయి విచారణ అనంతరం గురువారం నిందితుడిని దోషిగా నిర్ధా రించారు.
ఈ కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష మరియు రూ.1 5,000/- జరిమానా విధిం చబడింది. అదేవిధంగా బాధిత బాలుడికి రూ.3,00,000/- పరి హారం అందించబడింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత, డి.రఘు వాదనలు వినిపించారు.