–నాలుగు రోజులపాటు నలుగురు నిపుణుల పర్యటన
–పోలవరం పూర్వాపరాలను క్షు ణ్ణంగా పరిశీలించనున్న బృందం
–కాపర్ డ్యాములు, డయాఫ్రం వా ల్ పరిశీలించిన తర్వాత నివేదిక
–పురోగతిపై నిపుణుల నివేదిక కో సం ఏపీ ప్రభుత్వం ఎదురుచూపు లు
Polavaram: ప్రజాదీవెన, పోలవరం: పోలవరం ప్రాజెక్టు (polavaram project) నిర్మాణం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ (international )నిపుణుల బృందం రంగంలో కి దిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం (nda government)అధికారం చేపట్టిన వెను వెంటనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ జాప్యం క్షేత్రస్థాయి పరిస్థి తులను అధ్యయనం చేసేందుకు అంతర్జా తీయ నిపుణుల కమిటీని నియ మించబడిన విషయం తెలిసిందే. అయితే పోలవరం ప్రాజెక్టు ఎందు కు నిలిచిపోయింది, ప్రాజెక్టు నిర్మాణంలో (construction)అవాంతరాలు ఏమిటి, పనుల పునః ప్రారంభం తదితర అంశాలపై అధ్యాయం చేసేందుకు అంతర్జాతీయ జలనిపుణుల కమి టీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. పోలవరం అధ్యయనానికి సంబంధించి నాలుగు రోజుల పర్య టనలో భాగాంగా కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించిన అనంతరం పనుల పురోగతిపై నివేదిక సమర్పించనుంది ఈ కమిటీ. ఈ క్రమంలో పోలవరంలో (polavaram)కీలక సాంకేతిక సవాళ్లను పరిష్క రించేందుకు అంతర్జాతీయ జలవన రుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. అమెరికా, కెనడాల నుంచి నలుగురు నిపుణులు వచ్చిన వెంటనే కేంద్ర, రాష్ట్ర జలన రుల శాఖ అధికారులతో ఢిల్లీలో నిపుణులు బృందం సమావేశమైన అనంతరం రాత్రి రాజమండ్రికి చేరు కున్న నిపుణులు, పోలవరం ప్రాజె క్టు వద్ద అధికారులతో భేటీ తద్వా రా ప్రాజెక్ట్ సైట్ను పరిశీలిoచారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివ రాలు తెలుసుకున్నారు. కెనడాకు (Canada)చెందిన నలుగురు నిపుణులు శని వారం ఢిల్లీకి చేరుకోగా ఆదివారం నుంచి వారు పోలవరంలో తమ తమ పనులు ప్రారంభించారు.
*క్షేత్రస్థాయిలోనే నాలుగు రోజులు..*
నాలుగు రోజులపాటు అంతర్జాతీయ నిపుణులు (international officer)ఇక్కడే ఉండనున్నారు. మొదటి రెండు రో జులు పాటు ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించనున్నారు. ప్రతి కట్టడా న్ని క్షుణ్ణంగా పరిశీలించేలా పర్యట న షెడ్యూల్ సిద్ధమైంది. ఆ తర్వాత మరో రెండ్రోజుల పాటు సమస్యల ను పరిష్కారాలపై మేధోమథనం చేయనున్నారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు (polavaram project)అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్ సంస్థ ప్రతినిధు లు, వ్యాప్కోస్, బావర్, కెల్లర్, మేఘా కంపెనీ ప్రతినిధులు, అంత ర్జాతీయ డిజైన్ సంస్థ అఫ్రి ప్రతిని ధులు ఇందులో పాల్గొంటారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు, నిపు ణులతో అంతర్జాతీయ నిపుణుల బృందం చర్చించనున్నారు. అంత ర్జాతీయ స్థాయి నిపుణులు పోలవరం ప్రాజెక్టులో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు, పెను సవాళ్ల పరిష్కా రానికి అంతర్జాతీయ స్థాయి నైపు ణ్యం అవసరమని కేంద్ర జలసం ఘం నిర్ణయించిన క్రమంలో చక చక అడుగులు ముందుకు పడు తున్నాయి. ఇందులో భాగంగా డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ (international design agency)డిజైన్ ఏజెన్సీ అఫ్రి సాయం తీసుకుంటున్నారు. వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్ బి పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, సీస్ హించ్‌బెర్గర్, కెనడాకు చెందిన రిచర్డ్ డోన్నెల్లీలు నియమి తులు కావడం గమనారం. పోలవరం ప్రాజెక్టులో సవాళ్లకు సంబంధిం చిన కీలక అంశాల్లో వీరంతా నిపు ణులు కాగా అంతర్జాతీయ డ్యాం భద్రత నైపుణ్యం, స్ట్రక్చరల్ ఇంజినీ రింగ్, స్ట్రక్చరల్ సొల్యూషన్స్, సివి ల్ ఇంజినీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణా లు, జియో టెక్నికల్ ఇంజినీరింగ్ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీ య స్థాయి నైపుణ్యం ఉండటంతో వీరిని ఎంచుకున్నట్లు కేంద్ర జలసం ఘం పేర్కొంటోంది.