Police commissioner Sudheerbabu : అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
--రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు
అంకితభావం క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
–రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు
ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో తొ మ్మిది నెలల బేసిక్ ఇండెక్షన్ ట్రైనింగ్ (Basic induction tra ining) సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్ జిల్లాలకుచెందిన 265 మంది ఏ.ఆర్ ట్రైనీ కానిస్టేబుళ్ళ పాసింగ్ అవు ట్ పరేడ్ (Passing out parade of AR trainee con stables) కి ముఖ్య అతిథిగా రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు ( cp sudheer Babu), సూర్యాపేట జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్, నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ (sharat h chandra pawar) హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో తొమ్మిది నెలల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ట్రైని కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ వీక్షించి రాచ కొండ సిపి మాట్లాడుతూ 9 నెలలు ఎంతో క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చే సుకున్న ట్రైని కానిస్టేబుల్ (Pas sing out parade of AR train ee constables) కు అభినందనలు తెలియజేస్తూ పోలీస్ శాఖలో అంకితభావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ, తెలంగా ణ రాష్ట్ర పోలీసుశాఖ ( police department) కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఇక్కడ మంచి ఆక్సిజన్ పొందుతూ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇక నుంచి నూతన ఉత్సాహంతో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అం దిస్తూ ప్రాణవాయువు ( Oxygen) లాగా పనిచేయాలని అన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగం అంటేనే ఎన్నో సవాళ్ళతో కూడు కున్న ఉద్యోగం అని, శారీకంగా, మానసికంగా దృఢంగా ( Mentally st rong) ఉన్నపుడే ఎలాంటి సవాల్లనైనా ఎదుర్కొనగలం అన్నారు.
ఈ ట్రైనింగ్ అనంతరం కూడా రోజు వ్యాయామం చేసి ఫిట్ గా ఉం డాలన్నారు. పోలీసుశాఖ అంటే నే క్రమ శిక్షణకు మారుపేరు అని, అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని ట్రైనీ కానిస్టేబుల్స్ కు సూచించారు. ఎంతో కష్టబడి చదివించిన తల్లితండ్రుల కలల్ని (Parents dreams) సాకారం చేయాలని అన్నారు.
మీరు ఈ తొమ్మిది నెలల ట్రైనింగ్ మీ యొక్క 36 సంవత్స రాలు సర్వీస్ పూర్తి అయ్యేవరకు ఇక్కడ శిక్షార్హులు నేర్పిన శిక్షణా (tra ninig) తోడ్ప డుతుందని అన్నారు. అనంతరం శిక్షణా కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బెస్ట్ అల్ రౌండర్ జె.అనిల్, బెస్ట్ ఇండోర్ ఆర్.మహేష్,బెస్ట్ ఔట్ డోర్ ముజిబుద్దిన్,బెస్ట్ ఫైరర్ టీ. ప్రశాంత్, ప రేడ్ కమండర్ నరేష్ లకు అవార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డీటీసీ రమేష్,అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రాములు నాయక్, డిటిసి డియస్పి విఠల్ రెడ్డి,నల్లగొండ డీఎస్పీ శివ రాం రెడ్డి,ఏ. ఆర్ డీఎస్పీ శ్రీనివాస్,సిఐలు డానియల్ రాజశేఖర్ రెడ్డి,రాజు ఆర్.ఐలు హరిబాబు, శ్రీను,సంతోష్ , యస్.ఐలు బాబు,ప్రవీణ్, శ్రీనివాస్, భరత్ ఆర్.యస్.ఐ అఖిల్ చంద్ర, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సోమయ్య మరియు ఇండోర్,అవుట్ డోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Police commissioner Sudheerbabu