ప్రజా దీవెన, కామారెడ్డి: ఈ పోలీ సోళ్ళకు ఏమైంది, ఎస్సైతో పాటు ఇద్దరు పోలీసులు ఆత్మహత్య చే సుకోవాల్సిన అగత్యం ఏమొ చ్చిం ది అని అనేక కోణాల్లో అనుమానా లు వ్యక్త మవుతున్నాయి. అందిన సమాచారం మేరకు కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసు కుంది. బిక్కనూరు పోలీస్ స్టేషన్ ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఎల్లా రెడ్డి పెద్ద చెరువులో గల్లంతయ్యా రు. వారిలో శ్రుతి, నిఖిల్ మృత దే హాలు తొలుత లభ్యం కాగా కాస్తా ఆలస్యంగా సాయికుమార్ డెడ్ బాడీ వెలికితీశారు వీరంతా ఒకే సారి ఏకాభిప్రాయంతోనే ఆత్మహ త్య చేసుకున్నట్లు అనుమానిస్తు న్నారు. ఎస్పీ సింధు శర్మ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలు సుకుంటున్నారు.
చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలను చెరువులో నుండి వెలికితీసిన గజ ఈతగాళ్లు వెలికి తీశారు. ఇదిలా ఉండగా చెరువు కట్ట వద్ద ఎస్సై సాయి కుమార్ పర్సనల్ కారు, పాదరక్షలు, నిఖిల్ పాదరక్షలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలం లో శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు మాత్రమే ఉండి సాయి కుమార్ ఫోన్ లేకపోవడం స్విచ్చాఫ్ వస్తుం డటంతో పట్ల పోలీసులు అను మానాలు వ్యక్తం చేస్తున్నారు.