అక్కను చంపిన తమ్ముడు, మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా లో జరిగిన ఈ పరువు హత్య కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యు లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నం దుకు మహిళా కానిస్టేబుల్‌ను తోడబుట్టిన సోదరుడు అక్క మీద కోపంతో దారుణంగా హత్య చేశాడు. ఇబ్రహీంపట్నంలో ఈ పరువు హత్య జరిగింది. ఇబ్రహీం పట్నం మండలం రాయపోల్‌లో ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది.
రాయపోల్‌లో నివాసం ఉంటున్న మహిళా కానిస్టేబుల్ నాగ మణిని ఆమె సోదరుడు పరమేష్ కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి చంపా డు. నాగమణి కుటుంబ స భ్యులకు ఇష్టం లేకుండా కులాంతర వివా హం చేసుకోవడంతో కక్ష పెంచుకన్న పరమేష్ మాటు వేసి అక్కను చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. రాయపోలు నుంచి మన్య గుడ రహదారిపై ద్విచక్ర వాహనం పై కానిస్టేబుల్ నాగమణి ప్రయా ణిస్తుండగా మాటు వేసి హత్యకు పాల్పడ్డాడు.
మృతురాలు నాగమణి స్వస్థలం రాయపోలుగా గుర్తించారు. ప్రస్తు తం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నాగమణి పని చేస్తోంది.నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్టు గుర్తించారు.నాగమణి ప్రేమ వివాహం కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు.
Policeconistable