Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Polling Revenue: తెలంగాణ ఆర్టీసీకి పోలింగ్ ఆదాయం అమోఘం

తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు టీఎస్‌ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూ ర్చాయి. ఎన్నికల సమయంలో 2,5 00 పైచిలుకు బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ నడి పించింది.

పోలింగ్ కోసం ప్ర‌త్యేక బ‌స్సులు
పికి అద‌నంగా వెయ్యి బ‌స్సులు
తెలంగాణ‌లో 1500 బ‌స్సుల రాకపోకలు
13వ తేదీన 54 ల‌క్ష‌ల మంది ప్ర‌ యాణం
మొత్తంగా రూ. 24.22 కోట్ల మేర ఆదాయం
14న అంతే సంఖ్య‌లో ప్రయాణీ కుల తిరుగు ప్రయాణం
ఈసారి రూ.15 కోట్ల ఆదాయం
మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం ద్వారా రూ 9 కోట్లు

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు(Lok sabha elections) టీఎస్‌ ఆర్టీసీకి( TSRTC) భారీగా ఆదాయం సమకూ ర్చాయి. ఎన్నికల సమయంలో 2,5 00 పైచిలుకు బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ నడి పించింది. తెలంగాణలో సుమారు 1,500 బస్సులు, ఆంధ్రపదేశ్‌కు దాదాపు వెయ్యికి పైగా బస్సులను తిప్పింది. జేబీఎస్​, ఎంబీబీఎస్​ వంటి ప్రధాన బస్టాండ్​లతో పాటు ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లి, మియాపూర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించింది.

దీంతో రవాణా సంస్థ కు 23 గంటల్లోనే పెద్దఎత్తున ఆదా యం సమకూరింది.పోలింగ్‌ రోజైన ఈ నెల 13న ఆర్టీసీ బస్సుల్లో 54 లక్షల మంది ప్రయాణించారు. తద్వారా సంస్థకి రూ.24.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక ఎన్ని కల మరుసటి రోజు 54 లక్షల మంది తిరుగు ప్రయాణించారు. టికెట్ కొనుగోలు చేసిన వారి ద్వారా ఆదాయం రూ.15 కోట్లు సమకూరాయని అధికారులు తెలిపారు. ఇందులో మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో రూ.9 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఈ మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

Polling revenue for Telangana RTC