–ప్రజల దీవెనలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది
–భూపాలపల్లి యువతకు ఇండస్ట్రీ స్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు
–మైలారం ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన సభలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్కలు
Ponguleti Srinivas Reddy: ప్రజా దీవెన, భూపాలపల్లి: భూపాల పల్లి నియోజకవర్గంలో మంత్రులు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, వరంగల్ ఎంపీ కడియం కావ్య,(Sridhar Babu, Ponguleti Srinivas Reddy, Dhanasari Anasuya Sitakka, Warangal MP Kadyam Kavya,) టిజిఐఐసి రాష్ట్ర చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ట్రేడ్ ప్రమో షన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి ఇతర ముఖ్య నేతల పర్య టన విజయవంతమైంది. భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపుర మండలం మైలారం గ్రామ శివార్లలో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మంత్రులు పాల్గొన్నారు. ముందుగా చెల్పూర్ జెన్కో క్వార్టర్స్ లోని హెలీ ప్యాడ్ వద్ద ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ మంత్రులకు శాలువాలు కప్పి, బొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
అనంతరం మైలారం గ్రామ శివారులోని గుట్టలకు చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన ఇండస్ట్రియల్ కారిడార్ (Industrial Corridor)అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు తో పాటు ఇతర మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభ వద్ద మంత్రులు మాట్లాడుతూ భూపా లపల్లి యువతకు ఇక్కడ ఏర్పాటు కాబోయే ఇండస్ట్రియల్ పార్కుతో (Industrial Park) చాలామంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. యువతకు స్కిల్ ఇండియా (Skill India)ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను చూపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం యువతకు జాబ్ క్యాలెండర్ను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ తప్పక అమలు చేస్తున్నట్లు తెలిపారు. భూపాలపల్లి, ములుగు నియో జకవర్గాలకు సాగునీటి అవసరా లను తీర్చడానికి ప్రణాళికలు రూపొం దిస్తున్నామని, త్వరలోనే ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి డిపిఆర్ తయారు చేస్తామని అన్నారు.
అనంతరం భూపాలపల్లి పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన డ్రగ్స్ స్టోరేజ్ రూమును మరియు డాక్టర్స్ క్యాంటీన్ (Doctor’s Canteen) మంత్రులు ప్రారంభించారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి కలెక్టరేట్ లోని ఐడిఓసి సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు పాల్గొ న్నారు. జిల్లాస్థాయి అధికారులు అన్ని శాఖల అధికారులను సమ న్వయం చేసుకుంటూ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మంత్రులు అధికారులకు సూచనలు చేశారు. అనంతరం కలెక్టరేట్ లోని మంత్రుల ఛాంబర్ లో లంచ్ చేసి చెల్పూర్ జెన్కో క్వార్టర్స్ లోని హెలీ ప్యాడ్ (Heli pad) కు చేరుకుని అక్కడి నుండి హైదరా బాద్ కు మంత్రులు తిరుగు ప్రయా ణం అయ్యారు. కాగా, మంత్రులకు ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు దగ్గర ఉండి సెండ్ ఆఫ్ ఇచ్చారు. మంత్రుల పర్యటన విజయవంతం అవ్వడంతో ఎమ్మె ల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజాప్రతినిధులకు, అన్ని శాఖల అధికారులకు, నాయకులకు, కార్య కర్తలకు, అభిమానులకు, నియోజ కవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.