— గ్రామపంచాయతీలో నిధుల కొరత వాస్తవమే
–సమాచార పౌరసం బంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ప్రజా దీవెన, ఖమ్మం: గ్రామపంచా యతీలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే అని సమాచార పౌరసం బంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో విష జ్వరాల (fevers) భారిన పడిన వారిని మంత్రి సందర్శిం చారు. గత గడిచిన పది సంవత్స రాల కాలంలో గ్రామాల్లో మౌలిక వస్తులపై నిర్లక్ష్యం వహించటం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నా య న్నారు. మొన్నటి వరకు తాను నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగానని తెలిపారు. గ్రామాల్లో మౌ లిక వసతులు సరిగా లేవని తెలిపా రు.
తాము అంత చేసాం ఇంత చేసామనే గత ప్రభుత్వం ఏమి చేయలేదన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం ఒక పాలేరు నియో జకవర్గం లోనే కాదు రాష్ట్రమంతా పేదలకు అండగా ఉంటామన్నా రు.గ్రామపంచాయతీలో (Gram Panchayat)నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే అన్నా రు. వీలైనంతవరకు ఈ రోజే ముఖ్యమంత్రితో మాట్లాడతానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు రాష్ట్రానికి ఆయువుపట్టు అన్నా రు. గ్రామీణ ప్రాంతాలకి రావలసిన నిధుల కొరతను ముఖ్యమంత్రి (Chief Minister) మంత్రులతో మాట్లాడి గ్రాంట్ వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తానని అన్నారు. ధనిక తెలంగాణ అని చెప్పుకున్న గత ప్రభుత్వం చూస్తే మౌలిక వసతులకే కొరత కనపడు తుందని తెలిపారు. నేను గత ప్రభు త్వం మీద నింద మోపటం కాదు మౌలిక వసతులే సరిగా చేసు కోలేకపోయారని చెప్తున్నా అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తాం ఇదే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాగా ఇదే సమయంలో కూసుమంచిలో ముఖ్యమంత్రి సహాయ నిధిని 120మంది లబ్దిదారులకు అందజేశారు..