Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponguleti Srinivas Reddy: మిషన్ భగీరథలో భారీ అవినీతి

— 53 శాతం ఇండ్లకు మంచినీరు ఇవ్వలేదు
–వాస్తవాలు ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తాం
–రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy:ప్రజా దీవెన, వరంగల్: గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, 46 వేల కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో 15 వేల నుండి 20 వేల కోట్ల రూపా యల అవినీతి జరిగిం దని రెవె న్యూ, హౌసింగ్, సమా చార, పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)ఆరో పించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథపై సర్వే నిర్వహించగా 53 శాతం ఇండ్లకు మంచినీరు అంద డం లేదని భయం కరమైన విష యాలు వెలుగు చూసాయని వెల్ల డించారు.గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రాంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లా డుతూ మిషన్ భగీరథ కార్యక్ర మాన్ని ప్రజలకోసం చేసినట్టుగా లేదని, వారి జేబులు నింపుకోవడా నికి చేసినట్టుగా ఉందని విమర్శిం చారు. వాస్తవాలను ప్రజలకు తెలి యజేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇం టికి మంచినీరు అందిస్తామని ప్రక టించారు. గత పదేండ్లలో ఎన్న డూ లేని విధంగా వ్యవ సాయానికి బడ్జెట్ (Budget)లో రూ.72 వేల కోట్లు కేటా యించిన ఘనత ఈ ప్రభుత్వానిది.

27 రోజుల్లో 23 లక్షల మందికి రూ. 18 వేల కోట్ల రైతు రుణాలను(Farmer loans) రద్దు చేశామని సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం అందలేదని వీలైనంత త్వరలో వాటిని పరిష్కరించి ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి రైతన్నకు రుణమాఫీ చేస్తామని, అన్న మాట ప్రకారం 31 వేల కోట్ల రూపాయలకి ఇంకా కావాలంటే రెండు మూడు వందల కోట్లు ఎక్కువైనా పర్వాలే దు అర్హులైన ప్రతి రైతన్నకి ఈ ప్రభు త్వం చిత్తశుద్ధితో రెండు లక్షల రూపాయలు వరకు రుణమాఫీ చేసి తీరుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు వేరు వేరుగా అందించబో తున్నామని ప్రకటించారు.

మరి కొద్ది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేయ బోతున్నామని ప్రకటించారు. ఈ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు(For academic medical fields) అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు.ప్రాజెక్టుల పేరుతో మిషన్ భగీరథ పేరుతో వేల కోట్ల రూపాయలను కాజేసిన గత ప్రభుత్వ పెద్దలు తమ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి ప్రతి దానిని రాద్ధాంతం చేయడం అలవాటు చేసుకున్నారని దుయ్య బట్టారు. వారి పాలనలో అవినీతి అక్రమాలు జరిగినట్టుగానే ఇప్పు డు కూడా జరుగుతు న్నా యనే భ్రమలో బీఆర్ఎస్ నాయ కులు (Leaders of BRS)జీవిస్తున్నారని ఎద్దేవా విమ ర్శిం చారు.