Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponguleti Srinivas Reddy: వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దిపై ప్ర‌త్యేక దృష్టి

–ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప‌నులు చేప‌ట్టాలి
–నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి
–రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాలు, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివా స్ రెడ్డి

ప్రజా దీవెన, హైద‌రాబాద్ :- వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలు ఇచ్చారని, ఈ నేపధ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యత లను దృష్టిలో పెట్టుకుని వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారు లను ఆదేశించారు. వరంగల్ నగర అభివృద్ధిపై బుధవారం సచివాల యంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, ముఖ్యమంత్రి ప్రధా న సలహాదారు వేం నరేందర్ రెడ్డిల తో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రధానంగా వరం గల్ నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్ , భ‌ద్ర‌కాళి చెరువు, విమానాశ్ర‌యం తదితర అంశాలపై ప్ర‌ధానంగా చర్చించారు.ఈ సంద‌ ర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపా దించిన ప్రతి ప్రాజెక్టు కు సంబంధిం చిన డీపీఆర్ లను త్వరితగతిన తయారు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించి న గడువులోగా పనులు పూర్తి చే యాలని ఆదేశించారు.వరంగల్ నగరంలో నిర్మించే రింగ్ రోడ్డు జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూడాలని, ఈ ప్రాజె క్టుకు భూసేకరణను యుద్ధ ప్రాతి పదికన చేపట్టాలని సూచించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవ‌స‌ ర‌మైన భూసేక‌ర‌ణ‌ను యుద్ధ‌ప్రా తిప‌దిక‌న‌ భ‌ద్ర‌కాళి చెరువు శుద్దీ క‌ర‌ణ‌ప‌నుల‌ను వేగ‌వంతంగా చేప‌ ట్టాల‌ని ఆదేశించారు. ప్రాధాన్య‌త క్రమంలో ప‌నుల‌ను చేప‌ట్టి పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశిం చారు.

ఈ సమావేశంలో మున్సి పల్ శాఖ కార్యదర్శి శ్రీ దాన కిశోర్, ఆర్ధిక శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ ద‌ర్శి రామ‌కృష్ణారావు, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ డైరెక్ట‌ర్ శ్రీ‌దేవి, మైనింగ్ శాఖ కార్య‌ద‌ర్శి సురేంద్ర మోహ‌న్‌, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్ లు డాక్టర్ సత్య శారదా, పి. ప్రావీణ్య, త‌దిత‌ర శాఖల అధికారులు పాల్గొన్నారు