PonguletiSrinivasaReddy : అసెంబ్లీలో భూభారతి -2024 ఆర్వోఆర్ చట్టం…ప్రవేశపెట్టిన రెవెన్యూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో సామాన్యుల భూహ క్కుల పరిరక్షణే ధ్యేయంగా 2024 ఆర్వోఆర్ -భూభారతి చట్టాన్ని రూ పొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిం చారు. బుధవారం శాసనసభలో మంత్రి భూభారతి బిల్లును ప్రవేశపె ట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటువంటి అద్భుత చట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం తన కు లభించడం మరచిపోలేని విష యమని అన్నారు. 1971లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్వోఆర్ చట్టం 49 ఏళ్లపాటు ఉపయోగపడిందని, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కూడా ప్రజోపయో గంగా ఉపయుక్తమయ్యిందని తెలి పారు. తర్వాత అర్ధరాత్రి నాలుగు గోడల నడుమ రూపొందిన ధరణి చట్టం వలన సమస్యలు పరిష్కా రం కాకపోగా లక్షలాది సమస్యల ను తెచ్చిపెట్టిందని చెప్పారు.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్లు ధరణి పోర్టల్‌తో లెక్కలేనన్ని ఇబ్బందులు ఎదుర య్యాయని వివరించారు. లోక్‌సభ లో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, నాటి ప్రతిపక్షనేత , నేటి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి , నేటి ఉపము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ పాదయాత్రల సందర్బంగా ధరణిని అరేబియా సముద్రంలో కలుపుతా మని ఇచ్చిన హామీని ప్రజలు విశ్వ సించారని మంత్రి పొంగులేటి తెలి పారు. ఆమేరకు ఇందిరమ్మ రాజ్యా న్ని తెచ్చుకున్నారని, ఒక్క గుంట భూమి ఉన్న వారు కూడా తమను నమ్మారని, వారి నమ్మకాన్ని నిలబె ట్టేందుకుగాను ఆర్వోఆర్ 2020ను పూర్తిగా ప్రక్షాళన చేసి భూభారతిని రూపొందించామని చెప్పారు. తాము ఆగస్టు 2న ముసాయిదాను ప్రవేశపెట్టడమేగాక ప్రత్యేకంగా 40 రోజుల పాటు వెబ్ సైట్‌లో పెట్టి ప్రజాప్రతినిధులు,కవులు , మేధా వులు,విశ్రాంత అధికారుల సలహా లు సూచనలు స్వీకరించి కొత్త చట్టానికి రూపకల్పన చేశామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు 7 పేజీలు, వినోద్‌రావు 5 పేజీల సలహాలు, సూచనలు చేశా రని వాటిని కూడా పరిగణనలోకి తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. 33 జిల్లాలలో ఒక్కోరో జు ప్రత్యేక చర్చావేదికలు నిర్వహిం చి అందరి అభిప్రాయాలు తీసుకు న్నామని చెప్పారు.
18 రాష్ట్రాల లోని ఆర్వోఆర్‌లను అధ్యయనం చేసి , ఉత్తమ విధానాలను క్షుణ్ణం గా పరిశీలించి వాటిని భూభార తిలో పొందుపరిచామని మంత్రి తెలిపారు.ధరణ కారణంగా ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారని, కేసముద్రం మండలం నారాయణపురంలో కె. రవి అనే ఎంపీటీసీ సభ్యులు భూ సమ స్యలను బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలందరి దృష్టికి తీసుకువె ళ్లారని , ఏళ్ల తరబడి పరిష్కారం కాలేదని చెప్పారు. అంతేగాక సర్వేనెంబర్లు 149,150, 154,156, 168 తదతరాల్లోని 1398 ఎకరాల భూమి తరతరాలుగా అక్కడి గిరి జనుల సాగుబడిలో ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ధర ణి -2020 ఆర్వోఆర్ చట్టం వచ్చాక వారి హక్కులకు భంగం వాటిల్లేలా సదరు భూములు అటవీ భూము లని తేల్చిచెప్పారని దీంతో గిరిజ నులు తీవ్ర మనోవేదననకు గుర య్యారని మంత్రి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 4 నెలల పాటు రిజిస్ట్రేషన్‌లు ఆపివేశారని, దీంతో భూములు అమ్ముకొని కుటుంబంలో పెళ్లిళ్లు, చదువుల కోసం ఖర్చుచేద్దామనుకొనే సామాన్య రైతులకు తీవ్ర అసౌ కర్యం కలిగిందని మంత్రి పొంగు లేటి వివరించారు.భూభారతి బిల్లుకు సంబంధించి 22-23 సార్లు అభిప్రాయాలు తీసుకున్నామని, అందువల్లే బిల్లు ప్రవేశపెట్టడం లో జాప్యం జరిగిందని మంత్రి పొంగు లేటి చెప్పారు. ప్రజలకు పూర్తిస్ధా యిలో ఉపయోగపడేలా బిల్లు తయారుచేసేందుకు కృషి చేశా మని, సాదాసీదా బిల్లును ప్రజలపై రుద్దే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మరికొన్ని నిమిషాలు ఆయన మాటల్లోనే…భూమి చు ట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది.
తరతరాలుగా మనిషి జీవితానికి, భూమికి విడదీయరాని అనుబంధం ఉంది. భూమి పేదరి కాన్ని దూరం చేస్తుంది. ఆత్మగౌర వంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తుం ది. గ్రామాల్లో భూమే ప్రధాన జీవనా ధారం.భూమిని నమ్ముకుని బతికే కష్టజీవులను కంటికి రెప్పలా చూ సుకునే బాధ్యత ప్రభుత్వాలది. కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మ రించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రె స్ ప్రభుత్వం 1971లో తీసుకొచ్చిన ఆర్వోఆర్ చట్టం 49 ఏండ్లు విజ యవంతంగా అమలైంది. ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ లాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాల ను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీ సుకొచ్చింది.కాంగ్రెస్ అంటేనే ప్రజ లకు ఒక భద్రత, భరోసా. అందుకే ఇప్పటికీ ఇందిరమ్మను ప్రజలు గుం డెల్లో పెట్టుకుంటున్నారు.కానీ వేలా ది పుస్తకాలు చదివిన మేధావి 20 20 ఆర్వోఆర్ చట్టం ద్వారా తీసుకొ చ్చిన ధరణి పోర్ట ల్‌తో మూడేం డ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. ఉన్న నాలి కకు మం దేస్తే కొండ నాలుక ఊడి నట్లు ధర ణి పరిస్థితి తయారైంది.
రెవెన్యూ అధికారుల స్థాయిలో పరి ష్కారం కావాల్సినవి కోర్టుల దాకా వెళ్ళా ల్సి వచ్చింది. నాలుగు గోడల మధ్య కూర్చుని వారికి అనుకూ లంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా మన నెత్తి మీద రుద్దారు. ధరణి మానవ సం బంధాలను సైతం దెబ్బతీసింది. మనుషుల మధ్య దూరాన్ని పెం చింది.భూ యజమానికి తెలి యకుండానే చేతులు దాటిపో యేలా చేసింది. కాళ్ళకింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవే దనను చెప్పుకోడానికీ మార్గం లేకుండా చేసింది.అందుకే మా నాయకుడు రాహుల్‌గాంధీ గారు ఎన్నికల సమయంలో ధరణిని అరేబియా మహా సముద్రంలో వేస్తామని హామీ ఇచ్చారు. మా హామీని తెలంగాణ ప్రజలు విశ్వ సించి అధికారాన్ని అప్పగించారు. దానికి అనుగుణంగా మా ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మా సహచర ప్రజా ప్రతినిధుల సమక్షంలో ధరణిని బంగా ళాఖా తంలో కలిపి ఇచ్చిన మాటను నిల బెట్టుకుంటున్నాం.
ఇప్పుడు భూ- భారతిని తీసుకొస్తున్నాం. ఇందిర మ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా సీఎం రేవంత్‌రెడ్డి గారి సూచన మేరకు ధరణి కష్టాలను తెలుసు కుని వాటి పరిష్కారానికి భూ నిపు ణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అనేకసార్లు వివిధ రాష్ట్రా ల్లో పర్యటించి అక్కడి రెవెన్యూ చట్టాలను ఈ కమిటీ అధ్యయనం చేసింది. ఆనాటి దొరలు గడీల్లో కూర్చుని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజ లు కోరుకున్న విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్టు బిల్లును ఇదే అసెంబ్లీలో ఆగస్టు 2న ప్రవేశ పెట్టాం.ప్రజల నుంచి చట్టం రావా లనే ఉద్దేశంతో అదే రోజున సీసీఎ ల్ఏ వెబ్‌సైట్‌లో కూడా ముసాయి దా బిల్లును అందుబాటులో ఉం చాం. దాదాపు పాతిక రోజుల పాటు ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, మేధా వులు, సామాన్య ప్రజానీకం, రిటైర్డ్ అధికారుల నుంచి సలహాలు, సూ చనలను స్వీకరించాం. అన్ని జిల్లా ల్లో కలెక్టర్లు సదస్సులు నిర్వహించి అభిప్రాయాలను స్వీకరించారు.
• చివరకు 2020 చట్టంలో ప్రధాన పాత్ర పోషించిన తన్నీరు హరీశ్‌రా వు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచనలు కూడా స్వీకరించాం. ఒక చట్టం మీద ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సభలో భూ-భారతి బిల్లును ప్రవేశపెడు తున్నామన్నారు.
బిల్లులో ప్రధానాంశాలు…
–గత చట్టం (2020)లోని తప్పు లను అధ్యయనం చేసి భూ-భారతి ద్వారా సరిదిద్దడం.
–(ఏ) పార్టు-బీ లో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం.
–(బి) గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు పరిష్కారం.
–(సీ) భవిష్యత్తులో భూ వివాదా లకు తావు లేకుండా ఎంజాయ్ మెంట్ సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం.
–రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా వచ్చే మ్యుటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ (అథారిటీ)ని ఏర్పాటు చేస్తున్నాం.
ధరణిలో కొసమెరుపు : ఏదై నా పనికొచ్చేదున్నదంటే… రిజిస్ట్రే షన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటే. కానీ దురదృష్ట వశా త్తూ తప్పులకు పరిష్కారం చూపే వ్యవస్థే లేదు.
— వారసత్వం : వంశపారంపర్య భూములు..
–సేల్ డీడ్, వారసత్వం కాక కోర్టు ద్వారా వచ్చే, ఓఆర్సీ, 38-ఈ తదితర మొత్తం 14 రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ పవర్స్ ను ఆర్డీవో కు.
— సాదా బైనామా : 2020 నవంబ రు 10 వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన సుమారు 9.24 లక్షల దర ఖాస్తులకు పరిష్కారం
• భూధార్ : దేశంలో ప్రతీ పౌరు డికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుం దో మన రాష్ట్రంలో భూములకూ భూధార్ నంబర్.
— జమాబందీ, గ్రామ రెవెన్యూ రికార్డులు : 2014కు ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో ఇకపైనా అదే విధంగా కొనసాగిస్తాం. త్వర లోనే ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తాం. గత ప్రభు త్వం రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది.
— ల్యాండ్ ట్రిబ్యునల్స్: భూ వివాదాల గ్రీవెన్స్, అప్పీళ్ళ కోసం లాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు అవ సరాన్ని, ప్రాంతాన్ని బట్టి సంఖ్యపై ప్రభుత్వ నిర్ణయం
— సీసీఎల్ఏ ద్వారా రివిజన్ : ప్రభుత్వ ఆస్తుల్ని, రికార్డుల్ని ఉద్దే శపూర్వకంగా ఎవరైనా తారు మా రు చేస్తే సీసీఎల్ఏ ద్వారా రివిజన్ చేసుకునే ఆప్షన్ ను ఈ చట్టంలో పొందుపరుస్తున్నాం.
— ప్రభుత్వ అధికారులపై చర్యలు: ప్రభుత్వ ఆస్తుల్ని ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసే అధికారులపై చర్యలు తీసు కుని శిక్షించే అధికారాన్ని ఈ చట్టం ద్వారా తీసుకొస్తున్నాం.
అనుభవదారుడు / ఖాస్తు కాలం:
2014 కి ముందు పాస్ బుక్కులు కలిగి ఉంది అనుభవదారుడిగా పొసిషన్ లో ఉన్న వారు ధరణి తరువాత రోడ్డున పడ్డారు. గత ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించింది.ఈ భూ భారతిలో పట్టాదారులు, అనుభవదారులు అభద్రతాభావానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఈ చట్టం వీరికి సముచిత స్థానం కల్పిస్తాం.
మాన్యువల్ రికార్డుల భద్రత:
రెవెన్యూ రికార్డులు టాంపరింగ్ జరగకుండా కంప్యూటర్ రికార్డు లతో పాటు నిర్ణీత కాల వ్యవధిలో మాన్యువల్ కాపీని కూడా రెవెన్యూ కార్యాలయాలలో భద్రపరుస్తాం.
భూ-భారతి ప్రత్యేకతలు
• ఆరు మాడ్యూళ్ళు : ఆనాటి ధరణిలో 33 మాడ్యూళ్లు (ఆప్షన్స్) ఉండేవి. ఇప్పుడు దాన్ని ఆరు మా డ్యూళ్ళకు కుదిస్తున్నాం.
— 11 కాలమ్‌లు : గతంలో మాన్యువల్‌గా పహాణీలో 32 కాల మ్‌లు ఉండేవి. వాటిని ధరణిలో ఒకే కాలమ్‌కు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు దాన్ని 11 కాలమ్‌లు చేస్తున్నాం.గత ప్రభు త్వం కొన్ని వివరాలను బహిర్గతం కాకుండా లాకర్లలో బంధించింది. ఇప్పుడు భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకునేలా డిస్‌ప్లే చేస్తున్నాం. ప్రభుత్వ భూ ములు అన్యాక్రాంతానికి గురికా కుండా ఎవరైనా భూ భారతి ద్వా రా ప్రభుత్వానికి తెలియ చేయవ చ్చు. ఆ భూముల్ని పరిరక్షించేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాం. భూ-భారతిలో దరఖాస్తు చేసుకు న్న భూములున్న ఆసాములకు వారి మొబైల్ నెంబ ర్లకే అప్‌డేట్స్ వెళ్ళే సౌకర్యా న్ని కల్పిస్తున్నాం.
గతంలో ధరణి కార ణంగా అన్యా క్రాంతమైన భూముల వివరాలను భూ భారతి ద్వారా బట్టబయలు చేస్తాం. 2014కు ముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలోని రెవెన్యూ, ఎండోమెం ట్, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ తదితర భూము ల వివరాలను ధరణిలోని డేటాతో పోల్చి చూసి అన్యాక్రాంతమైన భూముల వివరాలను బహిర్గతం చేస్తాం. ప్రభుత్వ భూముల్ని ఆక్ర మించి నవారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు. ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతాం.
మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ : గత ప్రభుత్వం ధరణి తెచ్చిన తర్వాత మూడేండ్లు దాటి నా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవ డం తో తప్పులు జరిగాయి. ఆ త ప్పుల్ని ప్రజలపై బలవంతంగా రుద్దింది. ఇప్పుడు అలా జరగ కుండా మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేస్తాం.
గ్రామ స్థాయిలో రెవెన్యూ సద స్సులు :… రూల్స్ ఫ్రేమ్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు పెట్టి అధికారులతో పాటు నేను, సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన కనుగొంటాం.
త్వరలోలోనే ఒకే చట్టం.. గత ప్రభుత్వం మాటలతో మభ్య పెట్టింది. కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని చట్టాలను కలిపి ఒకే చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు 2020 ఆర్వోఆర్ చీకటి చట్టాన్ని ప్రజలపై రుద్దారు. పూర్తి అవినీతితో నిండి పోయిన ఈ చట్టం మూ డేండ్లకే నూరేండ్లు నిండిపోయేలా ప్రజలే మార్గనిర్దేశం చేశారు.అందరికీ ఆమోదయో గ్యంగా తీసుకొస్తున్న భూ-భారతి చట్టం కనీసం వందే ళ్ళు వర్ధిల్లుతుందని ఈ ప్రభుత్వం బలంగా నమ్ముతున్న.
PonguletiSrinivasaReddy