— రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజా దీవెన, హైదరాబాద్: మదర్ ఆఫ్ ద సాయిల్ (తెలం గాణ తల్లి) పుస్తకాన్ని రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా అసాధ్యం అనుకున్న తెలం గాణ ప్రజల ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేవలం సోనియా గాం ధీ దృఢ నిశ్చయం, త్యాగ నిరతి వల్లే సాధ్యమయ్యిందని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. . తెలంగాణ రాష్ట్రం సాధనలో సోనియా గాంధీ అమూ ల్యమైన పాత్రను ప్రతిబింబిస్తూ సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం నారగౌని రాసిన “మదర్ ఆఫ్ ది సాయిల్” పుస్తకాన్ని పొన్నం ప్రభాకర్ గౌడ్ నేడు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సోనియా గాంధీని “తెలంగాణ దేవత” అని కొనియాడారు.
“తెలంగాణ కోసం ఆమె చూపిన సంకల్పం, పట్టుదల అనన్యమైనవి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు సోనియా గాంధీ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది,” అని ఆయన పేర్కొన్నారు. “తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ప్రతి పోరాటంలో మన ఆవేదన, ఆశల కోసం సోనియా గాంధీ అందించిన మద్దతు వెలకట్టలేనిది,” అని అన్నారు. ఉద్యమ సమయంలో ఎదురైన సవాళ్లను, ప్రజల ఆవేదనను, పార్టీగా తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ, పొన్నం ప్రభాకర్ ఉద్యమ కాలంలో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. “తెలంగాణ ప్రజల ఆశయాలను సాకారం చేయడానికి సోనియా గాంధీ చూపించిన పట్టుదల తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాంగ్రెస్ పార్టీ త్యాగం మరియు సోనియా గాంధీ నాయకత్వంవల్లే రాష్ట్ర కల సాకారం అయ్యిందన్నారు “తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని ఎప్పటికీ మరచిపోలేము. సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసమే అధికారం కోల్పోయినా వెనక్కి తగ్గలేదు,” అని ఆయన అన్నారు.
అలాగే సోనియా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు . “సోనియమ్మ కలల రాష్ట్రాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రాజెక్టులు, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, మహిళా సాధికారతపై దృష్టిపెట్టి సోనియా ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు,” అని పొన్నం ప్రభాకర్ అన్నారు. రచయిత సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం నారగౌని తన “మదర్ ఆఫ్ ది సాయిల్” పుస్తకం గురించి మాట్లాడుతూ, ఇది సోనియా గాంధీకి మాత్రమే కాకుండా, కోట్లాది మంది తెలంగాణ ప్రజల కలలు, ఆశయాలకు అంకితమని చెప్పారు. ఈ పుస్తకానికి పరిశోధనతో పాటు సున్నితమైన రచనా శైలి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ తదితరు లు పాల్గొన్నారు.