Ponnam Prabhakar Goud: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలోని గీత కార్మికులందరికీ (Geetha workers
) కాట మయ్య రక్షణ కవచ్ మోకులను పంపిణీ కి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar Goud) తెలిపారు.గీతా కార్మికుల ప్ర మాదాల నుండి రక్షణ కోసం ఇటీవ ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గుడా లో ప్రారంభించిన కాటమ య్య రక్షణ కవచ్ మోకులను పంపి ణీ కి రంగం సిద్ధం చేశామని చెప్పా రు. ఆగస్టు 5 వ తేది నుండి ప్రతి నియోజకవర్గానికి వంద మోకుల చొప్పున మొదటి విడతల లో 10 వేల మోకులు పంపిణీ చేయను న్నట్లు రవాణా మరియు బీసీ సంక్షే మ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar Goud) వెల్లడించారు.
ఈ కాటమయ్య రక్షక్ కవచ్ మోకులను రాష్ట్ర వ్యాప్తంగా కల్లు గీత వృత్తి చేసుకునే ప్రతి ఒక్క రికీ ఈ మోకులను పంపిణీ చేస్తా మని తెలిపారు. నియోజకవర్గ కేం ద్రాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరగనుంద ని పేర్కొన్నారు. కాటమయ్య రక్షణ కవచ్ పంపిణీ కోసం తెలంగాణ బడ్జెట్ లో కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar Goud) వెల్లడించారు.