–బిఆర్ఎస్ నేతలు కళ్ళల్లో నిప్పు లు పోసుకుంటున్నారు
–వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే బిఆర్ఎస్ నేతల ఆరోపణలు
–సుంకిశాల పై సమగ్ర విచారణకు అదేశించాం దోషులు ఎవరున్నా వదిలిపెట్టం
— బిఆర్ఎస్ నేతల తప్పులన్నింటిని ప్రజల ముందుంచుతాం
–కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అ న్యాయం జరిగితే నోరు మెదపలేని మంత్రి కిషన్ రెడ్డి
–రవాణా, బీసీ సంక్షేమ శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆగ్రహం
Ponnam Prabhakar Goud:ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలం గాణ ప్రయోజనాల కోసం అధికా రికంగా స్వయంగా అమెరికా కు వెళ్తే బిఆర్ఎస్ నేతలకు ఎందుకు కళ్లు మందుతున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బాగు పడడం బిఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్ర యోజనాల కోసం ముఖ్యమంత్రి తో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఫైనా న్స్ సెక్రటరీ ,ఐటి , పరిశ్రమల శాఖ (Chief Secretary to Government, Finance Secretary, IT and Industries Department) అధికారులు డెలిగేషన్స్ తో చర్చిం చి రాష్ట్రానికి పెట్టుబడులు తీసు కొస్తున్నారని తెలిపారు. 10 సంవ త్సరాలుగా ఫార్మ్ హౌస్ నుండి బయటకు రాని ముఖ్యమంత్రి ఉంటే ఇప్పుడు ఎల్లలు దాటి ప్రజా పాలన పేరుతో తెలంగాణ ప్రజల బాగు కోసం చేస్తున్న ముఖ్యమంత్రి పై చేస్తున్న విమర్శలను తెలంగాణ ప్రజలు గమనించాలని మంత్రి పొ న్నం ప్రభాకర్ కోరారు. ముఖ్యమం త్రి అమెరికా పర్యటన లో తెలంగా ణ ప్రయోజనాలకు సంబంధించి అ నేక అంశాలు ముందడుగు పడు తుంటే కుటుంబపరమైన అంశాలు ప్రస్తావిస్తూ చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత ముఖ్యమంత్రి ఏనాడూ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలనే ఆలోచన చేయలేదని గుర్తు చేశారు. గత ప్ర భుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చు కోవడానికి బిఆరెస్ నేతలు (BRS leaders) ఆరోప ణలు చేస్తున్నారని దానిని ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచిం చారు.
సుంకిశాల బాధ్యులను ఒదిలి పెట్టం… సుంకిశాల బిఆర్ఎస్ హ యంలోనే నిర్మించారని ముఖ్యమం త్రి ఆదేశాలతో దాని ప్రమాదంపై సమగ్ర విచారణ కు ఆదేశించామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలి పారు. దీని వెనుక ఎవరున్నా వది లేది లేదని సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదారాబాద్ ఇంచార్జి మంత్రి గా నీళ్ళు హైదారా బాద్ తీసుకొచ్చే ప్రక్రియలో భాగం గా మున్సిపల్ ,హెచ్ఎండిఏ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు పూర్తిగా విచారణ చేయాలన్నారు.బిఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో కాళేశ్వ రం లోపభూఇష్టంగా నిర్మించి తెలం గాణ ప్రజలకు నష్టం చేశారన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతు ప్రయోజనాలు గత 10 ఏళ్లుగా తెలంగాణలో లేవని స్వయంగా రైతులు చెబుతున్నారన్నారు. బిఆర్ఎస్ డిఫెన్స్ లో పడి అసెంబ్లీ లో గిరిజన మహిళా సీతక్క అని చూడకుండా పోస్టులు పెట్టారని తెలిపారు. శాసనసభలు సరైన జవాబులు చెప్పలేక బిఆర్ఎస్ పారిపోయిందని పేర్కొన్నారు. స్పీకర్ దళితుడనే అధ్యక్ష అనాల్సి వస్తుందనే దొర తనంతో అసెంబ్లీ కి రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారం టీల్లో 200 యూనిట్ల ఉచిత విద్యు త్,500 కి గ్యాస్ రాని వారి వివరా లు సమర్పించి ఎడిట్ చేసుకోవా లని సూచించారు. 2 లక్షల రైతు రుణమాఫీ ఒకేసారి చేస్తున్నామని ఇప్పటి వరకు లక్ష 50 వేల వరకు రుణమాఫీ పూర్తైందన్నారు. రైతు లకు రుణమాఫీ వర్తించని వారు వివరాలు వ్యవసాయాధికారులకు ఇవ్వాలన్నారు. ఒక్క భిమదేవ రపల్లి మండలంలోని లక్ష రూపా యల లోపు రుణమాఫీ కోసం 21 కోట్లు రూపాయలు విడుదలయ్యా యన్నారు. పార్లమెంట్ లో సున్నా సీట్లు వచ్చినందునే బిఆర్ఎస్ నేతలు అసహనంతో మాట్లాడుతు న్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రుణమాఫీ తెలంగాణ లో అమలు చేశామని తెలిపారు. నిర్మా ణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్త మన్నారు.
కేసీఆర్ మాటలు కిషన్ రెడ్డి నోట… రుణమాఫీ కానీ వారు నిలదీయాలని అంటున్న కిషన్ రెడ్డి కేసీఆర్ మాటలు మీ రూపంలో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనీ విమర్శించారు. బిఆర్ఎస్ బీజేపీ వేరు కాదని ప్రజలు కూడా అలా చూడడం లేదన్నారు.బడ్జెట్ లో తెలంగాణ కు అన్యాయం జరిగితే మాట్లాడే చేతగాని మంత్రి కిషన్ రెడ్డి అని విమర్శించారు. న్యాయం గా ఉండి రైతులకు అన్యాయం జరి గితే ఆ సమస్యల పరిష్కారం మాద ని తెలిపారు. ప్రజా పాలన ద్వారా నడుస్తున్న ప్రభుత్వం తమది అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar Goud)వెల్లడిం చారు.