Ponnam Prabhakar :టీఎస్ఆర్టీసీ తీపికబురు, పలు కొ త్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మా ణం, విస్తరణకు నిర్ణయం
Ponnam Prabhakar : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ బస్ భవన్ లో శనివారం ఆర్టీసీ బోర్డు సమా వేశమై కొత్త డిపోలు, బస్ స్టేషన్ లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ సందర్బంగా రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూరాష్ట్రంలో కొత్త డిపో ల ఏర్పాటుతో పాటు ప్రస్తుతము న్న 97 డిపోలు & బస్ స్టేషన్ల అభి వృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసు కుంటుందని అన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిందని అందుకు అనుగుణంగా కొత్త బస్ స్టేషన్ల నిర్మాణంతో పాటు ఉన్నవాటిని విస్తరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు కొత్త బస్సులను కొనుగో లు చేస్తూనే మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామని పేర్కొన్నా రు.బోర్డు అనుమతి లభించిన నూ తన డిపోలు, బస్ స్టేషన్లను త్వర తిగతిన పూర్తి చేయాలని ఈ సం దర్భంగా ఆర్టీసీ అధికారులను మం త్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
టిఎస్ఆర్టిసి తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
–పెద్దపల్లి జిల్లా పెద్దపల్లిలో కొత్త బస్ డిపో కోసం నిర్మాణం కోసం రూ.11.70 కోట్లతో
— ములుగు జిల్లా ఏటూరునాగారం లో కొత్త బస్ డిపో నిర్మాణం కోసం రూ.6.28 కోట్లతో
–ములుగు జిల్లా ములుగు లో కొత్త బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 5.11 కోట్లతో
–సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ లో కొత్త బస్ స్టేషన్ కోసం రూ. 3. 75 కోట్లతో
–ఖమ్మం జిల్లా మధిరలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.10 కోట్లతో
–ములుగు జిల్లా మంగపేటలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 51. 00 లక్షలతో
— పెద్దపల్లి జిల్లా మంథని బస్ స్టే షన్ విస్తరణ కోసం రూ.95.00 లక్షలతో
— సూర్యాపేట జిల్లా కోదాడ్ వద్ద ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కో సం రూ. 17.95 కోట్లు
— జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రాబోయే “సరస్వ తి పుష్కరాల” దృష్ట్యా ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 3.95 కోట్లు కేటాయిస్తూ ఆర్టీసీ బోర్డు అనుమతులు ఇచ్చింది.