బ్రేకింగ్ న్యూస్
ప్రజా గాయకుడు గద్దర్ మృతి
ప్రజా దీవెన /హైదరాబాద్: ప్రజా గాయకుడు కళాకారుడు గద్దర్ మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ మెరుగైన చికిత్స కోసం అనేక ప్రయత్నాలు సాగించి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు.
దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గద్దర్ మరణ వార్తను ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.ప్రజా గాయకుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్‌రావు (74) ఇక లేరన్న వార్త దశ దిశ వ్యాపించడంతో కళాకారులు, అభిమానులు, రాజకీయ పార్టీలు, నాయకులు శోక సంద్రంలో మునిగిపోయారు.
ఆయన 1949 తూఫ్రాన్ లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.ఇటీవల గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రిలో గద్దర్‌కు పలువురు ప్రముఖులు పరామర్శలు కొనసాగుతుండగానే ఆయన కన్నుమూశారు.
ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది లో చైతన్యం తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా గద్దర్ రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో గుండె ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన మృతిచెందడం విషాదకరంగా మారింది.
ఇక, తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గద్దర్ 1949లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని తుప్రాన్‌లో జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివారు. గద్దర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 1969 ఉద్యమంలో కూడా గద్దర్ పాల్గొన్నారు. మా భూమి సినిమాలో వెండితెరపై గద్దర్ కనిపించారు. జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ కూడా ఒకరు. 1971లో నర్సింగరావు ప్రోత్సాహంతో ఆపర రిక్షా అన్న పాటును గద్దర్ రాశారు. అనేక పాటలు స్వరపరిచారు. ఉద్యమ సమయంలో వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దుమీద అనే పాట ఎందరినో ఉత్తేజపరిచింది. తన పాటతో గద్దర్ ఎంతో మందిని ఉత్తేజపరిచారు. 1975లో కెనరా బ్యాంకులో గద్దర్ ఉద్యోగం చేశారు. హన్మాజీపేట స్వగ్రామం. 1984లో కెనరా బ్యాంక్‌లో క్లర్క్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ పోరాడారు. ఇక, 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో నకిలీ ఎన్‌కౌంటర్లను గద్దర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజా సాహిత్య పురస్కారం కూడా గద్దర్ అందుకున్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డి నివాళులు...ప్రజా గాయకుడు గద్దర్ పార్దివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిoచారు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాధరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,రవీంద్ర నాయక్,చిరుమర్తి లింగయ్య తదితరులు.