పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక*
POW: ప్రజా దీవెన, కోదాడ : కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కోదాడ ఆర్డీవో కార్యాలయం (Office of the RDO)వద్ద ధర్నా నిర్వహించి ఏ డి ఓ కరుణ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లిరేణుకమాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలకు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు వరకు అందులో కొన్నింటినీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు తక్షణమే మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని అన్నారు.
మహిళలకు 500 గ్యాస్ తో పాటు 200 యూనిట్ల విద్యుత్తు ఉచిత బస్సు (Free bus)కల్పించారు కానీ ఈరోజు వరకు కళ్యాణ లక్ష్మి ఒంటరి మహిళలకు 2500 ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు, ఒంటరి మహిళలకు 2500 ఇయ్యకపోవడం వల్ల ఏ బతుకుదెరువుకు లేని వాళ్ళకు ఏ ఆధారం లేకుండా ఉండి జీవనం గడపడం ఇబ్బందిగా మారింది అదేవిధంగా పేదవాళ్లు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తే కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారము ఇస్తానని కాంగ్రెస్ పార్టీ (congres party) వాగ్దానం చేసింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఆ హామీలను నెరవేర్చకపోవడం వల్ల పేద కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన ఒంటరి మహిళలకు 2500 అదేవిధంగా కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం అందించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ హుజూర్నగర్ కోదాడ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మి, పావని, శ్యామల, దుర్గ , అలివేలు, నాగమణి, తదితరులు పాల్గొన్నారు